పుట:శ్రీసూర్య శతకము.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై యుదాహృతుల వలన శ్రీరామకవిగా రెంత తెనుగుదనముతో దీని ననువదించిరో తెలియగలదు.

యతి, పద ప్రయోగములు

శ్రీరామకవిగారు మహాకవులే గాక, ప్రాచీన మహాకావ్యలక్ష్య లక్షణ పరిజ్ఞానము గల మహావిద్వాంసులు. వారి దేవీభాగవత వీఠికలో, వ్యాకరణచ్ఛందో విశేషముల నెన్నింటినో వివరించినారు.

యతులు

ఇందు వా రుపయోగించిన కొన్ని యతులు చూడుడు.
జ్ఞ - క యతి - కనురుచివంటి భాస్కరుడు జ్ఞానదయాదుల మీకు నిచ్చుతన్ 24 ప.
మ - వ యతి - దీవులు వెలిగించు దీపము మిమున్ రవిదీప్తి సుఖింపఁజేయుతన్ 28 ప.
మహిమ దహించు నర్యముని వార్వపుబంతి శుభంబు మీకిడున్. 47 ప.

ద్వారశబ్దమున కచ్చుతో యతి

అప్పకవీయమున నొకటే యుదాహరణ మీయబడినది.

"ద్వారమునం దడంగ నరుణాఖ్యుఁ డదల్చిన. 48 ప.

"అమరిన పెద్ద చుక్కలకు ద్వారనగంబులు." 70 ప.