పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/184

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

145


పటుచిత్ర చిత్రిక ప్రభల నీక్షించు న
             య్యానందవశమున నడఁగఁజేసి

యంతమీఁదట మార్గమధ్యంబునందుఁ
బటు దృషత్ఖండ మండిత భవనమునను
నిలిచియిండిన యాభీరలలనఁ గాంచి
శిరమువంచి నమస్కృతుల్‌ చేసి భక్తి. 280

కానుక లొసఁగుచు ముందట
బూని యఖండంబు నిలిపి పూజింపుచు త
ద్ధ్యానంబుంజేసి యవ్వల
మానితగతి నరుగుచుంద్రు మనుజులు భక్తిన్. 281

అంత సోపానపద్దతి నధిగమించి
యద్భుతంబై న కోటీశ్వరాలయంబు
గాంచి తదుపాంత కాంతార కాంతసీమ
విశ్రమించి పథశ్రమ వినిమయించి. 282

కోటీశు గుడిచుట్టు గోపురంబు లనంగ
             గోపురం బొరసిన కొనలుగలిగి
కొనల గీలించిన గు రుతర కలశముల్‌
             గగనస్థ తారకాగణము గాఁగ
గగనస్థ తారకాగణము లగ్రస్థల
            మల్లీమతల్లికా మాలికలుగ
మాలికాకారతరి మురారి నిలయంబు
            చుట్టు నిల్చిన ప్రభఁ జూచిచూచి

యద్భుతాక్రాంతచిత్తులై యహహ ! యిట్టి
యుత్స వంబులు గలవె యీ యుర్వియందు