పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/171

ఈ పుట ఆమోదించబడ్డది

134

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


అందు దేవోత్సవం బెట్టిదనిన. 240


గరుడ గంధర్వ యక్ష కిన్నర సుపర్వ
సిద్ధ సాధ్యదిగీశ్వర శ్రీశ కమల
గర్భ దేవర్షి బ్రహ్మర్షి గణము లుత్స
వంబు గనుగొన వేడుక వత్తు రెలమి. 241

మును దేవేంద్రుఁడు శంభురాజ త్రిజగన్మూర్ధాభి షేక స్థితిన్
గనుటం డా శివరాత్రి కాలమున రంగారన్ ద్రికూటంబునం
దున గోటీశ్వరు బూజఁ జేసినను జెందుం బ్రహ్మపట్టంబునా
కనుచుం దివ్య గజాధిరూఢుడయి డాయన్ వచ్చు నచ్చోటికిన్‌. 242

భవవిద్వేషి మఖంబునందున హవిర్భాగంబు భక్షింప సం
భవమౌ కల్మష మీత్రికూటమున దీపానేక రూపంబుచే
శివరాత్రి న్నిశి భక్తసంఘముల కక్షీణాంధకారంబు బా
ప వినాశంబగు నంచుఁ బావకుఁడు ఠేవన్‌ వచ్చు నచ్చోటికిన్‌. 243

శివభక్తౌఘము మున్నెఱుంగకయె నే శిక్షింపగాఁ బోయి యా
శివుచే శిక్షితవృత్తినైతి నిక నే శ్రీమత్త్రికూటాద్రిపై
శివరాత్య్రాగత భక్షులం గనుచుఁ దచ్చిహ్నంబులుం జూచి వా
రి విసర్జించెదనంచు నంతకుఁడు బేర్మిన్‌ వచ్చు నచ్చోటికిన్‌. 244

శివు కారుణ్యముచే దిగీశ్వరుఁడనై చెన్నొందితిం గాని యా
శివభక్షిక్రియ లే నెఱుంగను పలాశి ప్రనస్ఫురద్వంశసం
భవముం గాంచుట నీ శివోత్సవమునన్‌ భక్తిక్రియల్‌ గాంతు నం
చువిలాసంబున వచ్చు నిరృతియు దా సొంపొంద నచ్చోటికిన్‌. 245

సర్వజలాధినాథునిఁగ శంభుఁడు నన్నొనరించె నింక నీ
సర్వజనంబు లుత్సవము సంగతి నచ్చటఁ గూడ వారికిన్