పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/166

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

131


సాలంక ! నీవంటి సద్భక్తు నెచ్చట,
          వినమును జూడము వేయునేల ?
కలియుగం బిదియౌటఁ గనుపడ కే మిట్లు
          గుహలలో దాగి త్రికూట నాథు
కోటీశుఁ బూజించి కోర్కెతో నణిమాది
          సిద్ధిసంతానంబుఁ జెందినాము
కూటత్రయంబున గుహలును బిలములు
బహుళంబు లుండు నీ పర్వతమున

నందుఁ గల చిత్రములఁ జెప్ప నలవి యగునె
యమర తరువులు సురభు లయ్యమృతనదులు
గలవు తత్ప్రాంతములయందు నిలిచి సిద్ధ
పటలి కోటీశుఁ గూర్చి తపంబు సేయు. 225

ఇమ్మహాస్థలి మహిమంబు లేల చెవ్ప
నెంత జెప్పిన మూఢాత్ము లెఱుఁగలేరు
చెప్పకుండినఁ బ్రాజ్ఞులు తప్పకుండ
గాంచెదరుగాన మౌనంబె గాంతుమింక. 226

అని చెప్పి సాలంకా ! నీవును నిర్విశంకుండవై యిమ్మహాశివరాత్రి నుపవాస జాగరంబులు సేసి కోటీశ్వరలింగంబునకు బిల్వపత్రార్చనంబుజేసి తదాజ్ఞాప్రకారంబుగాఁ బ్రభలుకట్టించి సేవింపుమని యానతిచ్చి, యంతర్దానంబుజేసిన నతండు నా దిక్కున కభిముఖుండ్లై నమస్కరించి నంతట.227


బహు ధనవంతు లౌట నిజభాగ్యసమృద్ధికొలంది భక్తిచే
బహుళ విచిత్రవైఖరి ప్రభానికురుంబము గట్టి చుట్టునన్‌
బహువిధ వాద్యముల్‌ మొరయ భక్తవరుం డతఁ డేఁగుదెంచుఁ దా
నహహ వచింప శక్యమె మహాద్భుతమైన తదుత్సవస్థితిన్‌: 228