పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/165

ఈ పుట ఆమోదించబడ్డది

130

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

దేవా ! కొందఱు లింగం బపరిచ్ఛిన్నంబై యంతటం బరిపూర్ణ౦బై యుండ పరిచ్ఛిన్నంబయి జదంబయిన శిలారచిత లింగంబులఁ బూజింపనేల యని యందు రది యసంగతం బా లింగం బదృశ్యంబగుట దేవతలు క్రైలాసమందుండు దివ్యమంగళవిగ్రహంబును మానవులు మహాస్థలంబులందుండు శిలా లింగంబులఁ బూజింపుఁడని వేదంబులు బలుకుచుండు నదియునుగాక, యదృశ్యంబై సర్వగతంబయిన వాయు వతిశీతోష్ణప్రదంబై జనంబులకు, బాధయొనర్చియు న య్యై యెడల పరిచ్ఛిన్నంబులై జడంబులైన వ్యజనాదులయందు జనించి సుఖంబొసంగిన రీతి నపరిచ్ఛిన్నుండును నదృశ్యుండైన యీశ్వరుండును సృష్టి స్ధితి లయ కృత్యంబులఁ బ్రాణులకు బాధ యొనర్చియు న య్యె యెడల బరిచ్ఛిన్నంబులై జడంబులయిన లింగంబులం దావిర్భవించి భక్తులకు నిష్టార్ధసిద్ధియును ముక్తియును గావించునన నేన దృష్టాంతంబగుదునని యందఱు వినఁ బల్కి మఱియు నిట్లనియె. 221


కోటీశానుని బాసి యుండగఁలనా ఘోరంపు సంసార దు
ష్కూటంబందున జిక్కి సొక్కుచు మనఃక్షోభా ర్తిపాలౌ నస
త్కోటిం గూర్ప కనందు భక్తతతితో గూడంగ నీ యద్రిరా
ట్కూటాగ్రంబునం జేర్పవయ్య నిను నే గొల్తున్ దివారాత్రముల్‌. 222

కోటీశ్వర ! కోటీశ్వర !‌
కోటీశ్వర ! యనుచు భక్తికొలఁది నుతింపన్
గోటీశ్వర ! వారల ధన
కోటీశులఁ జేయఁగల వకుంఠిత లీలన్. 223

అనుచు నుతియించు సాలంకు నాత్మవేది
గాంచు కోరిక మదిలోన గడలుకొనఁగ
సిద్ధసంతతి చనుదెంచి శీఘ్రముగను
బలికె నాతనితో మృదుభాషణముల. 224