పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/164

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

129


కావించి మఱియు నాపోవక కోటీశ్వర లింగంబునందు హృదయారవిందంబుఁ జేర్చి దృష్టి నిల్పి, యానందబాష్పబిందుసందోహంబు నయనారవిందంబులఁ గందళింపఁ గంచుకిత రోమాంచాంచిత శరీరుండగుచు గద్గద‌ కంఠుండై యిట్లని స్తుతించె. 215

విశ్వమంతయు నీవయై వేఱు లేక
నిలిచి యుండుటఁ గంటి నీ నిశ్చయంబు
దొలఁగకుండఁగఁ జేయవే తొలఁగెనేని
నిట్టి తెలివికి ఫలము లే దెంచిచూడ. 216

నీ మహిమాస్పద భక్తిని
నీ మహి కొఱతేమి లేక యే నుండుటచే
పామరులగు దుర్జనులను
వేమఱు యాచింపఁబోవు వెత మానెగదా ! 217

పలుకుల్‌ నీమతియందు, మానసము నీ పాదాబ్జమం, దీక్షణం
బులు నీ రూపమునందు, హస్తములు నీపూజావిధానంబునం,
దల కర్ణంభులు నీకథాశ్రవణమం దర్పించి దీపింప ని
శ్చల వృత్తిం దయఁజేసి ప్రోవఁగదవే సర్వజ్ఞ కోటీశ్వరా ! 218

అని యా లింగముఁ గౌగిలించుకొని, తా నానంద బాష్పాళిచే
దనరంగా నభిషేకమిచ్చి, తన హృత్కంజంబునున్ శుద్ధ వా
సవయన్ ధూపము దెల్పి, దీపముగ విచ్చన్ గూర్చి యాత్మార్పణం
బొనరించెన్ శివభక్తిపూర్ణుఁడయి, వాచ్యోంకారవర్గంబుచేన్. 219

ఇట్లు గావించి సాలంకుఁడేమిచెప్ప
దనివిచాలక యా లింగదర్శనంబు
చేసిచేసి మహానందసిద్ధిఁగాంచి
యెలమి నద్దేవుఁ గనుఁగొని యిట్టులనియె. 220