పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/156

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

121

రుద్రాక్ష మాలాలంకృత కంఠుండై కోటీశ్వరోపకంఠంబునం దకుంఠ భక్తి భావంబున నిల్చి కోటీశ్వరాష్టాక్షరీ మహామంత్ర జపంబు సేయుచు నా మంత్రరూపంబైన కోటీశ్వరాష్టోత్తరశతనామంబులఁ బూజించె నదెట్లనిన. 161

అష్టోత్తర శతనామములు


ఓంకార వార్ధి శీతాంశు రోంకార బిసపంకజః
ఓంకార పంజర శుక శ్చోంకారాచల కేసరీ. 162

ఓంకార మత్ర సంవేద్య శ్చోంకారాలయ సంస్థితః
ఓంకార పద్మినీ హంస శ్చోంకార వరకుంజరః. 163

నగరాజ సుతాజానిః నగరాజ ధనుర్ధరః
నవభూతి విలిప్తాంగో నాగాభరణ భూషితః 164

నాదామృత రసాస్వాదో నాదబ్రహ్మ స్వరూపకః
నాదాతీతో నాదపరో నాద మూల నివాసకః. 165

నాగాజిన ధరో నాదినాదీ నాదైక గోచరః
నతా ర్తితిమిరార్కాభః నానాభక్త జనావనః. 166

నారదాది మునిధ్యేయో నయవేదీ నరప్రియః
నామరూప పరిత్యక్తో నారాయణసుపూజితః. 167

మోహాంధకార తరణిః మోహకాంతార పావకః
మోహాబ్దికుంభ సంభూతో మోహానల మహాంబుదః. 168

ముగ్ధేందు భూషణో ముగ్ధో ముగ్ధావామాంగ సుందరః
మూలమాయాసమాసక్తో మూర్తిమత్కల్ప పాదపః. 169

కోటీశః కోమలాకారః కోటిసూర్యనమప్రభః
కోటిబ్రహ్మాండ సంచారః కల్పితాఖిల విష్టపః. 170