పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/149

ఈ పుట ఆమోదించబడ్డది

116

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

మఱియు మోచకుండగు న న్నుపాసించుటవలన బంధమోచనం బగు విజ్ఞానంబు నీ కుపదేశించితి నిట్లు వాసనాత్యాగ యోగంబున సర్వంబును బ్రహ్మంబుగాఁ జూచుచు నీవు ని య్యుపవాసవ్రతంబు చాలించి వాసనా త్యాగచిత్తంబున నిజ నివాసంబున జీవన్ముక్తిస్థితి నుండుమని యుపదేశించిన నమ్మహామహున కయ్యతివ గురుపూజా విధానంబు యథావిధిఁ గావించి యనేక వందనంబులు జేసి యిట్లనియె. 135


మీ రుపదేశించిన యీ
సారతరాద్వైతబోధ సరణిని ముక్తి
శ్రీరాజ్య పదము గంటిని
ధీరోత్తమ! నీ బుణంబుఁ దీర్పఁగ వశమే ! 136

అవి తనదు వ్రతము దప్పక
వనజానన సేయుచుండ వలదని యును న
మ్ముని దలఁచెను మది మాయా
జనితోపాయంబు వ్రతము చాలించంగన్. 137

గర్భ చిహ్నంబుఁ గల్పింతుఁ గాంత కివుడె
యదియు నవమాస పూరితంబైన పిదప
నైన మానకయుండునే యతివ వ్రతము
చోద్యమగు దీనిధై ర్యంబు జూతమనుచు. 138

అమ్మహాత్ముండు దన యోగప్రభావంబున నయ్యింతికి గర్భంబుఁ గల్పించిన నదియు నవ మాసపూరితంబై బహుళాయాస కరంబైన నిది మహాద్భుతంబగు దైవ యోగంబనితలంచియు వ్రతంబుఁ జాలింపక చేయు నా తలోదరి ధైర్యంబునకు దయాళుండై య య్యతీంద్రుఁ. డిట్లనియె. 139


నీవు బ్రహ్మంబవై యున్న నిజము గనియు
గర్భభరమున నాయాస కలితవయ్యు.