పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7

పట్టాభిరామశాస్త్రి గారు పరిష్కరించి ముద్రించిరి. (2) మల్హణసూక్తి సంగ్రహము. (3) పుష్పందోదిత స్తనము. (పుష్పదంతుని మహిమ్న స్తవము) (4) ప్రదోష పూజామాహాత్మ్యము మొ. వి. ఇవి యలభ్యములు,

పురాణ కథావిధానము :

ప్రజలీ క్షేత్రస్వామినిగూర్చి వాడుకగఁ జెప్పుకొను కథను ముందు క్లుప్త ముగఁ దెలిసికొని గ్రంథస్థ కథాభాగమును పిదపఁ దెలిసికొందము. కలియుగాదిని కొందఱు జంగమయ్యలు శివధ్యాన తత్పరులై కాశికిఁబోవ సమకట్టి నడుమ నడుమ మకాములు చేసికొనుచుఁ బోవుచుండిరఁట. ఈ త్రికూటాచలక్షేత్ర మిఁక పది పదునైదుమైళ్ళ దూరములో నున్నదనఁగా నొక లింగధారి అపర శంకరుఁడన నొప్పు నాతఁ డా గుంపునఁ గలిసి వారికి దివ్యబోధలు సేయుచు వెంటనంటెనఁట. దానికి వారెల్ల రాశ్చర్యనిమగ్నులై యా సమీప గ్రామమునం దొక బసవని సంపా దించి దానిపై నాతని గూర్చుండ నేర్పఱచి భజించుచు, మహిమలఁ జాటుచు నీ క్షేత్రమునకు వచ్చిరఁట. వెంటనే యాజంగమయ్య వారితో 'భక్తులారా నే. నీ త్రికుటాచలమును వీడఁజాలను, చూచివత్తును. మీరిందేయుండుఁ'డని బసవనితో గూడఁ బైకెక్కెనఁట. రెండుమూన్నాళ్ళకును వానిరాక గానక మిగిలినవారు తల కొక దిక్కున కొండను ప్రాఁకి వెదుకఁగా వెదుకఁగా నొక్కచో నాతని రూపము తళుక్కున మెఱపు మెఱసినట్లయి లింగమొకటి యబ్బురముగ గన్పించి, నాఁటి రాత్రి వారి కొక యోగిరూపమున దర్శనమిచ్చి ధన్యులఁ జేసినట్లు చెప్పుదురు. తదాదిగా దీనికి త్రికూటాచల క్షేత్రమనియు, లింగమునకు త్రికోటీశ్వరస్వామి యవియు నామములేర్పడి భక్తులు తరించుచున్నట్లు చెప్పుదురు. అయ్యాదిలింగమే రుద్రశిఖరమునఁగల ప్రాఁత కోటీశ్వరస్వామి యందురు.

గ్రంథస్థ కథావిధానము :

శ్రీ మహాదేవుఁడు పరాశక్తితో కైలాసమున నుండ పార్వతి శివుని గూర్చి "దేవా ! నీవు దక్షిణామూర్త్యవతారమున వసించిన శ్రీమత్త్రికూటాచలము • మహాత్మ్యమును విన్పింపు' మని వేఁడెను. అప్పుడు శివుఁడిట్లు చెప్పదొరఁకొనెను

'పూర్వము బ్రహ్మమానస పుత్తుఁడగు దక్షుఁడు మేరు పర్వతమున శివునిగూర్చి గొప్ప తపమొనర్చి తత్ఫలితముగా ఆదిశక్తి కూతురును శివుఁ డల్లుఁడును వగునట్లుగ వరముఁ బడసి, యట్లేకాఁగా వరగర్వంబునఁ గన్నుగాన