పుట:శ్రీభృంగరాజమహిమ.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

23

కం.తంగేడు వేపచెట్టును
భృంగమహారాజు కాన్గవేరును త్రికటుల్
శృంగారత్రిఫలములు
రంగగు తిప్పయును రోగరాజికి రిపువుల్

తంగేడుచెట్టు వేపచెట్టు గుంటగలగర కానుగవేరు శొంఠి
పిప్పళ్ళు మిరియాలు, కరకతాడీ యుసిరికలు యివి రోగనాశ
కములందురు.

క. విసపుముసిణి జిల్లేడును
వెసనీశ్వర దుష్ఠుపును భువింగలిజేరుం
బసచెంచలి సహదేవియు
విసములడచు భృంగరాజు - పృథుయుక్తి మెయిన్

విషముషిణి వేరు జిల్లేడు చిగుళ్ళు ఈశ్వరచెట్టు, దుష్టుపు
యిగుళ్ళు తెల్లగలిజేరు ఆకురసము చెంచలిచెట్టు సహదేవి
చెట్టు యివి గుంటగలగరాకు రసముతో కలిసిన యెడల అన్ని
విషములు హరించును.

కం.కడులేత కలగరాకును
వడిబచ్చడిజేసి దినమువరుసగ గొనినన్
గడుబలమును కాంతియు గలి
గెడునని సిద్దుండుపలికే కేవలదయతోన్

లేత గుంటగలగరాకు పచ్చడి చేయించి అనుదినము
సేవించినయెడల దేహమునకు బలమిచ్పునని సిద్దుడు చెప్పెను.

క. దొడ్డిన్ గల కరమేడియు
తెడ్డుపాలయును తెల్లదింటెన నాల్గున్
ఒడ్డారించిన తాచులు
గడ్డని నడువంగలేవు కడుభీతిమెయిన్

గుంటగలగరచెట్టు, మేడిచెట్టు, తెడ్లపాలచెట్టు, తెల్లదింటె నచెట్టు, యీ నాల్గును దొడ్లో పెంచినయెడల దొడ్డిలోనికి త్రాచు పాములు సాధారణముగా రానేరావు.