పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/79

ఈ పుట ఆమోదించబడ్డది

48

శ్రీనివాసవిలాససేవధి


వితతపరాక్రమవీరసింహంబు
చంద్రవంశంబున జనియించి కీర్తి
చంద్రికల్ వెదజల్లు సర్వజ్ఞమౌళి1140
శంఖకుందమ[1]రాళచంద్రసత్కీర్తి
శంఖణుఁడను రాజు జలజాస్త్రసముఁడు
తిలకింపవే సిగ్గుతెర పుచ్చి వీఁనిఁ
గలికి నీ కెనయైన కాంతుఁ డితండె
కుందనంబును మణి గూడిన పగిది
పొందు దీనికి నీకుఁ బొసఁగు నిక్కంబు
నెల వెన్నెలను జెంది నీటైన యట్ల
యెలనాఁగ! నిను బొంది యితఁడు రంజిల్లు
రతి మదను వహించి రహి మీఱినట్లు
పతిగాఁగ నీతని బాల చేకొమ్ము1150
నా విని మాళవనరనాథుకన్య
భావించి తనమదిఁ బతిగా వరించి
ఈక్షణోత్పలదాన మెసఁగంగఁ బూన్చి
లక్షితమధుకమాల్యంబును వైచె
అంతనే దుందుభు లార్భటి మ్రోసె
కాంతలదీవనల్ కడువేడ్కఁ జెలఁగె
మంచలు దిగి యేగు మహిపాలురకును
ముంచినచీకట్ల ముఖపద్మపాళి
ముకుళించె శంఖణుముఖచంద్రుఁ డలరి
ప్రకటించె శ్యామానుభావకలక్ష్మి1160

  1. వ్రా. ప్ర. కుందమరంద