పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

17


మనుచు నానతియిచ్చి యఖిలభూచక్ర
మనువుగాఁ గనుఁగొంచు నట సంచరించి
కులపర్వతమ్ములు కుదురుగా నుంచి
జలధుల విభజించి చంద్రసూర్యులకు
నుచితతేజములతో నుండ నేమించి
రుచిరమౌ గౌతమీరోధము చేసి380
చెంతను భక్తితో సేవించుగరుడు
సంత వీక్షించి యిట్లని యానతిచ్చె

వైనతేయుఁడు హరియాజ్ఞచే వైకుంఠమునుండి రత్ననగరాజమును దెచ్చుట



పక్షీంద్ర నీవు నిబ్బరమున నేగి
యక్షీణలక్ష్మిచే నలరువైకుంఠ
నగరంబునను మన నగరిలో రత్న
నగరాజ మొకటి యున్నదిగదా దాని
భువికిఁ దేవలె నిందు భూరిలీలలను
దవులుగా విహరింపఁ దమిబుట్టు మదిని
ఇందిరారమణిని హితపారిషదుల
నిందురా తోడ్కొని యేగి వేవేగ390
ననుచు నియోగించి యావైనతేయు
ననిచి గౌతమిదాటి యలకౌతుకమున
మరి కుంభజావాసమహితదిగ్భాగ
మరయుచు గౌతమి కరువ దామడను
స్వర్ణముఖర్యాఖ్యవాహినిచెంత
స్వర్ణ[1]నగాధిత్యసదృశమౌ నొక్క

  1. వ్రా.ప్ర. స్వర్ణగణాద్యంస