పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/359

ఈ పుట ఆమోదించబడ్డది

328

శ్రీనివాసవిలాససేవధి


దిలకించి విస్మయోదీర్ణభావమునఁ
బులకించ మైమరుల్ బొడమ డెందమునఁ
దనచూపు మరలింప ధైర్యంబులేమిఁ
గనుఁగొంచు నిలుచు నంగజమాయఁ దగిలి,
ఆ నాగకన్యక యా నృపుఁ జూచి
మానసంబున మరుల్ మమతయు మించ
కువలయాప్తునకు మేల్‌గొను చకోరికల
హవణికఁ దనచూపు లానంద మంద 510
నతని రూపవిలాస మరయుచు భావ
మతులితోల్లాసంబు లందఁగా నందు
సొలయుచు నీతఁ డా సురరాజసుతుఁడొ
నలకూబరుఁడొ యల్ల నలినసాయకుఁడొ
గాకున్న నీసోయగము విలాసములు
చాకచక్యంబు నెసంగు మైరుచులు
గలుగునే యొరునకీ గతి నంచు మిగుల
వల పగ్గళించ నవ్వనమున నడుగు
దరలఁజాలక నిల్చి తనకేలు బొదల
విరుల [1]గుత్తుల నంటివిడువక నదల 520
సొలపుచూపులు రాజు సొగసుల వంటి
కలువలు వెదచల్లఁగా మనోరథము
నెక్కుడు గాఁజెంది యిందీవరాస్త్రుఁ
డెక్కిడువింటితూ పెదనంటి నాట
సొమ్మసిల్లుచుఁ జాల సొక్కి, చిత్తరువు
బొమ్మచందంబునఁ బొలుపొందుచుండ

  1. "నిరులగొంతుల నంటి ” వ్రా. ప్ర. పాఠము.