పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/180

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

151


శిరము క్రిందుగఁ బడి చిదిశి వ్రక్కలుగ
మురిగిన కూశ్మాండమున్ వలె పొలిసె430.
అటుల నా దానవు నిలఁ గూల్చి గెల్చి
పటహార్భటులు మీఱ పావకాఖ్యుండు
చక్రప్రభునిఁ జేరఁ జయ్యన వచ్చి
వీక్రమంబున దైత్యు విదళించుతెఱఁగు
వివరించి కేల్మోడ్చి వినతుఁడై చెంత
సవినయంబుగ నిల్వఁ జక్రప్రభుండు
నతని కౌఁగిటఁ జేర్చి యనునయింపుచును
స్తుతియించి బహుమతి శోభిల్లఁదనదు
కంకణమ్ము లొసంగి కరుణించి మరియు
కింకరావళి నెల్ల కెలన రాఁ బిల్చి440.
వరుస భూషణములు వస్త్రంబు లొసంగి
పరులచే మృతిబొందు భటులఁ గ్రమ్మరను
బ్రతికించి యా దిశాభాగంబునందు
క్షితిసురాదిజనంబుఁ జెలిమి రావించి
యభయమిచ్చి కుదిర్చి యచట నొక్కరుని
ప్రభువుగా నుండంగఁ బట్టంబుగట్టి
జయభేరి పటహనిస్సాణఢక్కాది
మయతూర్యభాంకృతుల్ మట్టుమీఱంగ
గీర్వాణగంధర్వకిన్నరగరుడ
ధూర్వహనుతులబంధురనాదమెసఁగ450.
నమరదుందుభిబృందమార్భటి మొరయ
సుమవర్షధార లచ్చో జడిగొనఁగ
నచ్చరల్ నర్తించ నామోదభరము