పుట:శృంగారశాకుంతలము.pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

శృంగారశాకుంతలము

     వాధరుల సల్లాపంబులు [1]చెవులకుఁ జల్లఁగా వినుచు నుల్లసంబున భూవల్ల
     భుండు చప్పుడు సేయకుండె నప్పుడు శకుంతల విస్రస్త[2]కుంతలయు
     విధ్వస్తధైర్యయు, విన్యస్తసాధ్వసయునై యనసూయాప్రియంవదల
     నవలోకించి.73
గీ. ఏను మీచెలి నిం తేల యెరవు సేయ
     వింతవారైన మొఱ యాలకింతు రకట
     ప్రాణసములరు కావరే ప్రాణ మెత్తి
     మమత విడువక మార్పరే మధుపబాధ.74
క. నేఁ జనినచోటి కెల్లను
     దాఁ జనుదెంచుచును మఱలఁ దనుఁ జోఁపంగా
     మీఁజేతులెల్ల గిజగిజ
     గాఁ జేసెను మొగలిముండ్లు గాఁడినభంగిన్.75
గీ. వివర మొనరింప బొందులు వేఱుగాని
     ప్రాణ మొక్కటి మనకుఁ బద్మాక్షులార
     పాపరే నాకు నీయీతిబాధ యనిన
     జిట్టకాలకు వార లచ్చెలువతోడ.76
ఉ. ఇంతి తపస్వికన్యకల మే మసనుర్థల మీతిబాధ భూ
     కాంతుఁడు మాన్పి ధాత్రిప్రజఁ గావను బ్రోవను గర్త కాన దు
     ష్యంతున కేము చెప్పెదము సాధుజనార్తిహరుం డతండు దు
     ర్దాంతుని నియ్యలిం గెడపి తామరపూఁజెఱసాలఁ బెట్టెడున్. 77
వ. రాజుసన్నిధికిం బోయెదమని నగవులకు రెండుమూఁడుపదంబు లరిగిన
     ననసూయాప్రియంవదలవెంట నాక్రోశంబు సేయుచు శకుంతలయుం
     గదలె నయ్యవసరంబున భూవల్లభుం డప్పల్లవాధరలం గనుంగొని లీలా
     వ్యాజంబున నీరాజవదన లాశ్రమసదనంబునకుం జనకుండ నెఱింగించు

  1. చెవులన్
  2. కేశయు