పుట:శృంగారశాకుంతలము.pdf/71

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33

క. ఇలు వెడలి మానవుఁడు తన
     తలఁచిన తావునకుఁ జేరుఁదాకను నేయం
     కిలి లేక ఱెక్క తీరుపు
     వలయును శాకునికవరులవచనవిధమునన్.131
సీ. హర్మ్యంబు వెడల వాయసము చేరువ
                    దీర్చె వృషభం బెదుర ఱంకెవేసి నిలిచె
     వాడలో శునకంబు వచ్చెను దక్షిణం
                    బుదపూర్ణకుంభంబు లెదురుపడియె
     గవని వెలుపల బెరికయుఁ బోతు వలగొనె
                    వలఱెక్క సూపెఁ జేవలతిఁ జెమరు
     పరువు నేలను వచ్చేఁ బాల [1]పయ్యెరవంక
                    కుడినుండి యెడమకు నడిచె నక్క
తే. నీవు వేఁటకు విచ్చేయునెడ నృపాల
     పంచి పెండ్లికి నగు శకునంబు లయ్యె
     నేడు గొల్లలమాట మన్నించి నిలిచి
     మృగయ కరుగుట మిక్కిలి మేలు ఱేపు.132
క. నా విష్ణుః పృథివీపతి
     నా విష్ణుం డనఁగ నీవ నరవర దైవం
     బీ వారగింపకుండిన
     నీ వల్లవులకు శుభంబు లేలా కలుగున్.133
వ. వీరలం గృతార్థులం జేయం గృపగలదేని యారగింపవలయు నది యెన్ని
     దినంబులం గోలెఁ గన్నయదిలేదు దండుగ దర్శనంబులు గొనం దలం
     పయ్యెనేని ముందఱ జాగి విచ్చేయు మనిన గొల్ల లుల్లంబునం దల్లడిల్లి
     యీ బ్రాహ్మణుండు పలికినది యథార్థంబు. మా యర్థప్రాణంబులు
     నీసొమ్ము. వలసినట్లు చేసికొమ్మనిన మాండవ్యు ద్రిమ్మరి మాటలకు
     [2]దిగులు సొచ్చిన గోపాలకుల భూపాలకుండు మృదువచనంబుల నుపచ

  1. పయ్యెదవంక
  2. సొబగు విచ్చిన