పుట:శృంగారశాకుంతలము.pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

శృంగారశాకుంతలము

     రుచికచాకచిక్రీడాచతురసితేతరపట్టపటలప్రాలంబముక్తాఫలవితానతార
     కితవియత్సమంబును, నత్యంతసమున్నతిమదుపరినిశాతశాతమన్యవశిలాశ
     లాకానీలనీలచ్చర్దివిలగ్నవినూత్నరత్నకేసరస్తబకనిబిడబిసకనకకుముదా
     రవిందసౌగంధికసందర్శితకపటగగనపుష్పంబును, నభిరామదూర్వాదళదా
     మకోమలప్రభాపటలగర్వసర్వస్వపశ్యతోహరహరిదుపలభిత్తికాంతరజిత
     రూపవాతాయనంబును,వళక్షకిరణచ్ఛవిచ్ఛటావిస్ఫుటస్ఫటికపాషాణఫలక
     సోపానమార్గనిర్గమప్రవేశద్వారవిద్యోతమానవిపులతపనీయకవాటాలంకృ
     తంబును, నభ్రంకషశిరోభవనశిఖరస్థాపితశాతకుంభకుంభకాంతిగండూషిత
     నభోమండలంబును,[1]ద్రయ్యంతరాస్తీర్ణవిచిత్రరత్నకుధాసనవిన్యాసంబుల
     శోభిల్లు సభాసౌధంబున నమూల్యరత్నకీలనజాజ్వల్యమానకల్యాణభద్ర
     పీఠాంతరంబున నాసీనుండై యొక్కమంజువాణి వింజానురంబును, నొక్క
     [2]జోటి వీటికాపేటికయు, నొక్కబాల యాలవట్టంబును, నొక్కకరటి
     గమన [3]సురటియు, నొక్కలేఁజిగురాకుఁబోఁడి కాళంజియు, నొక్కచందన
     గంధి గంధవొడిబరిణయు, నొక్కపుండరీకనయన యగరుధూపధూమ
     కరండంబును, నొక్కకన్నె పన్నీరుతోడి కప్పురంపుగిండియు, నొక్క
     భృంగాలక బంగారుసంగెడయు ధరియించి డగ్గఱి కొలిచియుండఁ
     బాండ్యపల్లవపాణి యాటలాడ భోటకరహాటకళింగాంగవంగబంగాళ
     చోళనేపాళకాదిభూపాలకకుమారవర్గంబుం దగిన నెలవులం బలసి
     సేవింప హితపురోహితామాత్యబంధుమిత్రభృత్యపాఠకపీఠమర్దవిదూష
     కాదులు భజింప సుధర్మాంతరంబున నోలగం లైన దేవేంద్రుడునుం బోలె
     సాంద్రవైభవంబునం గొలువుకూర్చున్న యవసరంబున.96
ఉ. జుంజురుపల్ల వెండ్రుకల జొంపములుం గల మస్తకంబులుం
     గెంజిగురాకుఁ గెంపుఁ దులకించెడు వట్రువకన్నులుం జర
     త్కుంజరచర్మపట్టములకు న్సరివచ్చు బెరళ్ల మేనులు
     న్ముంజులు గొల్వఁ గొందఱు సముద్ధతి వచ్చి పుళిందవల్లభుల్.97

  1. రమ్యాంత
  2. బోటి
  3. సురంటియు