పుట:శృంగారశాకుంతలము.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

17

మ. దివిఁ బ్రాకారము ముట్టియుండగఁ దదుద్దేశంబునం గోటతోఁ
     దవులుం జక్రమ నిక్కమంచుఁ బురిమీఁద న్రాక పార్శ్వంబులం
     [1]గవనుంద్రోవ ననూరుయత్నమున రాఁగా నౌటఁగాఁబోలుఁ బో
     రవితే రుత్తరదక్షిణాయనములం బ్రాపించి దీపించుటల్.71
శా. ప్రాసాదోపరినాట్యశాలికలపైఁ బద్మాననల్నర్తనా
     భ్యాసక్రీడ లొనర్పం [2]దద్భ్రమిరయవ్యాయామజం బైన ని
     శ్వాసామోదముఁ బ్రోదిసేయు నికట స్వర్వాహినీకూలకు
     ల్యాసంవర్ధితకేసరప్రసవమధ్యాసారసౌరభ్యముల్.72
చ. మెలఁతుక లప్పురి న్నిడుద మేడలఁ గ్రీడలు సల్పుచుండి మిం
     చులు జళిపించు కన్గవల సోరణగండ్లను జూడ నీడగుం
     దెలుపును నల్పుఁగూడ నెడత్రెవ్వని చూపులఁ గైరవంబులుం
     గలువలు దోరణావళుల గట్టిన యోజల రాజవీథులన్.73
క. పురికోట రత్నదీప్తుల
     నరుణములై చుక్కలుండ నంగారకునిం
     బరికించి యందుఁ దెలియక
     కరము విచారింతు రెంత [3]కార్తాంతికులున్.74
క. పరిఘజలంబులు మొదలను
     సురనది నీ రాడ పరికె చుట్టున నుండం
     బురికోట లగ్గపట్టఁగ
     నరిది వితర్కింప వాసవాదులకైనన్.75
చ. శ్రుతి గవుడొందినం గమలసూతికినై నను దీర్చి చెప్ప నే
     రుతురు పురాణశాస్త్రములు ప్రొద్దున నిండ్లను గీరశారికా
     తతుల పరీక్ష లీవిని ముదంబును బొందుదు రింద్రుపట్టముం
     గ్రతువులు వే యొనర్చినను గైకొన రప్పురి విప్రసత్తముల్.76

  1. గవుడుం, గవడుం;
  2. దద్భ్రమర
  3. కార్తాంతికులన్