14 శృంగారనైషధము
చ. | ఇతఁడు దరిద్రుఁ డౌ ననుచు నేర్పడ నర్థిలలాటపట్టికన్ | 57 |
తే.* | అతనికీర్తిప్రతాపంబు లవనిఁ గలుగ | 58 |
వ. | అన్నలుండు నళినబాంధవుండునుంబోలెఁ బ్రతిదినంబును నభ్యుదయంబు నొందుచుఁ, గ్రమంబున శైశవంబు నతిక్రమించి యౌవనారంభంబున నరిదుర్గలుంఠనావసరంబులంబోలె లోహార్గళదీర్ఘపీనతయును గోపురద్వారకవాటదుర్ధర్షతిరఃప్రసారితయును బాహావక్షంబులచేత బందీగ్రాహంబు గ్రహించి రోమకోటికపటంబున హాటకగర్భుడు పాటించి లిఖించిన సుగుణగణనారేఖ లవయవంబులం బొలుపార సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబు విడంబింపం జాలునెమ్మొగంబునకుం గళంకాలంకారశంక నంకురింపఁజేయంజాలు కోమలశ్మశ్రురాజి విరాజిల్లం గండు మెఱసి రెండవకుసుమకోదండుండునుంబోలె విలాసినీమండలికిం గన్నులపండువై వెండియు. | 59 |
తే. | దాస్య మొనరించు విధుఁ డేతదాస్యమునకుఁ | 60 |