పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/463

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

422 శుకసప్తతి

భృదస్నానకుతూహలుండగు నద్దేవుని వెంటనె ప్రాగంబునిదానంబున కరిగి, వేఁగిన పున్నమనాఁడు, ప్రాతఃకాలంబున తదంబుల గ్రుంకి, మధ్యాహ్నంబునకు, చకచకితగోపురమణీడంబరంబగు పురంబునకుఁ జని, సంజనితకంజాతవిహారమాణరథాంగవధూవిభ్రమశ్రీకరంబగు నభ్రసరోజాకరంబున మునుకలిడి, తనుకలితకనకవసనరుచినిచయప్రకాశితదిశాబృందుండగు గోవిందదేవుని సందర్శించి, విజ్ఞానసభాభాసమానుండగు నీశానునకు నమస్కారంబు గావించి, యేతెంచి, దినాంతరంబున, సదావాసితగంగానిర్ఝరిణియగు నిత్యపుష్కరిణి నవగాహంబు గావించి, నిశాముఖంబున వరాహదేవుని సేవించి, తత్ప్రసాదంబును భుజియించినవారికి, దేశాంతరనివాళియైన, దుష్కృతక్లేశలేశంబులు లేక, యనేకాభీష్టంబులు చేకూరు; నావెనుక కైవల్యంబునకుం గాణా చీకాండ్లగు. దైవయోగంబున నమ్మాఖమాసం బాసన్నమైయున్నయది. ఏను దద్వ్రతాచరణంబున కఱుగుచున్నవాఁడ నచ్చటికి వచ్చితిరేని రమ్మని పలికిన యమ్మహీసురపుంగవునిం గనుంగొని యభంగురసంతోషాంతరంగుండై గుణశాలి యిట్లనియె. 162

మ. మును నీతావకపాదపద్మవినుతిం బూతాత్మతం జెందినాఁ
డనొ నీసత్కరుణాగుణంబు కొనియాడం శక్యమే నాయశం
బునకున్ విస్మృతి దెల్పితే దయవెసం బూర్ణంబుగాఁ దెల్పి దో
కొనిపొ మ్మచ్చటి కేను వత్తు నిక నీకున్ శిష్యశిష్యుండనై. 163

సీ.చక్కగాఁ బోనున్న సంయమనీపురం
బున కేఁగుత్రోవల ముండ్లుగొట్టి