పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/437

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

396 శుకసప్తతి

వెడలి తత్కాలసన్నిహితు లగు పరిచారకులు గొలువం జనుదెంచి. 47

క. తలతల మని కొందఱు బ్ర
ద్దలవా రెడఁగలుగ జడియ ధరణీధవుఁ డ
క్కలకంఠిఁ జేరి యనునయ
ముల మరలమి సమ్మతించి ముందుగ నడిచెన్. 48

తే. అంతఁ దొలునాఁటి రాత్రి రహస్యభంగిఁ
గాంతిమతి తీర్చి నను బందుకట్టి యునికి
నేను నొకజోగి వాల్కంబుఁ బూని భద్ర
కాళి సన్నిధి నుంటి గింకరునీరీతి. 49

తే. అచ్చటికి వల్లభుండు ధరాధినాథుఁ
డాదిగా మూఁక వెంటరా నరుగుదెంచి
కాంతిమతి చేరి తత్కాళికాపదాబ్జ
ములకు వెస మ్రొక్కి లేచి నిశ్చలత నిలిచి. 50

తే. కదిసి ప్రజలార కంటిమి కాన మనక
చూడుఁడని పల్కి ధైర్యవిస్ఫురణ మెఱయ
జనవరునిఁ జూచి రాజ నాసత్య మిపుడు
విశద మగును పరాకని విన్నవించి. 51

క. నినునంటి భద్రకాళీ
యనయము విభునంటి యీమహాయోగివరే
ణ్యుని నంటినఁ గాక మఱె
వ్వని నంటిన శాస్తి చేయ వలయు న్నాకున్. 52

మ. అని యక్కాంతిమతీవధూటి పలుకం బ్రావిర్భవద్విస్మయం
బున సారెం దలయూఁపసాగె గిరిశాంభోజాక్షి తన్మూర్ధకం