పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివరణ మీకృత్యాదిపద్యములంబట్టి యిట్లు తెలియవచ్చుచున్నది.

చంద్రవంశక్షత్రియులలో నచ్యుతగోత్రజులు పాలవేకరివారను నింటిపేరుగలవా రుండిరి. వారికి రాజధాని తాడిగోళ్లపురము[1]. మొదట పాలవేకరి పెదయోబళరాజు రాయలవారిచే నశ్వవారణరత్ననవరత్నహారాంబరాదులచే బహూకరింపఁబడి, పిదప అళియ రామరాజు చేసిన యుద్ధములకుఁ గర్తయై “గదెరాకమున తెర్క మొదలుగల్గు” బహురాజ్య మేలి సమగ్రమహాహవోగ్రసప్తకసహస్రచాపభృత్సైన్యజితమదాహీతెంగాగనుద్రుండై” కోడుగలు మొదలగు గ్రామములను శ్రీఖాదిరీనృసింహమూర్తికి సమర్పించి వన్నె కెక్కినవాఁడు. ఈ రాజు కుమారుఁడు నారవిభుఁడు. ఇతనికిఁ దొమ్మండ్రు సుతులు. వీరిలో నొక్కఁడగునౌబళుఁడు ప్రసిద్ధి కెక్కెను. ఈ నృపునియగ్రమహిషి బాలమ. ఈ దంపతులకు కరిమాణిక్యరా జుద్భవించెను. ఈతఁడు రామదేవరాయలసరిగద్దియం గూర్చుండుమన్ననం గాంచి యనేకబిరుదములం బడసెను. కరిమాణిక్యరాజునకు లచ్చమ్మ, రాచమ్మ, రంగమ్మ, భద్రమ యని నల్వురుపత్నులు. వీరియందు వసంతరాజు, రామరాజు, నారపరాజు, కదురరాజు నను నలుగురు సుతులు జనించిరి. వీరిలో వసంతరాజునకు రామరాజు తనయుఁడయ్యెను. ఈ రామరాజు శ్రీరంగరాయలచే మత్స్యమకరధ్వజాదిచిహ్నములం బొందెను.


  1. శాసనములలోన Tadigotla యని కనఁబడునదియే తాడిగోళ్ల కావచ్చును.