పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ii

రావుగారు, తాము ప్రకటించిన “కదిరీపతికాలము" అను వ్యాసము నిందులో చేర్చుట కనుమతి యొసంగిరి. విపులమగు నుపోద్ఘాతమేగాక విశేషపదములపట్టిక అర్థసహితముగ నిందుండుటచే నీ ముద్రణము ఆంధ్రమహాజనుల నాకర్షించునని నమ్ముచున్నాము. ఈ గ్రంథప్రకటనమున మాకుఁదోడ్పడిన పై వారల కందఱకు మాకృతజ్ఞత నిందుమూలముగఁ దెలుపుచున్నాము.