పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/245

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

శుకసప్తతి

దిగులుపడఁగఁ దూర్పు తెలతెల గావచ్చె
వారి కిట్లు తెల్లవాఱె నంత. 390

క. విను మో ప్రభావతీ సతి
తన నేరం బెట్లు తప్పదాట న్వలయున్
మనమున దీని కుపాయము
గననేరని నారి జార గారాదుసుమీ. 391

క. అని పలుకు చిలుకపలుకుం
గనుఁగొని వైశ్యాంగనాశిఖామణి యిచ్చో
నను నడుగు టుడుగు బెడఁగుగ
ననఘగుణా నీవె నొడువు మవ్వలికథయున్. 392

ఉ. నావిని కీర మిట్లను ఘనాఘనవేణి సనాతనప్రవీ
ణావలిఁ గేరు నీకుఁ దెలియంబడకున్నదె యైన మద్వచః
శ్రీ వెలయింపఁ గోరి తిఁకఁ జెప్పెద నప్పగిదిం బ్రభాతవే
ళావిభవంబు మీఱుఁడుఁ గలంగుచు జారుఁడు లేచిపోయినన్. 393

ఉ. అచ్చపలాడి యింటిమగఁ డంపఁగ నిప్పుడె బావినీటికై
వచ్చితి వచ్చి జారరతివాంఛల నుండితి నింతలోనఁ దా
నెచ్చటనుండి వచ్చె రవి యీతని కెక్కడఁ బ్రొద్దువోదు నా
యిచ్చ గలంగసాగెనిఁక నేమని యేను గృహంబుఁ జేరుదున్. 394

వ. అని వితర్కించి ధైర్యం బవలంబించి యొక్కకార్యంబుఁ గాంచి యీయుపాయంబున కీయుపాయంబ యుచితం బని తలంచి నిశ్చయించి కుంభంబు జలపూర్ణంబు గావించి సరజ్జుకంబుగా దిగవిడిచి తానును మెట్లవెంబడిఁ గూపంబులోనికిం డిగ్గి కటీదఘ్నంబు లగుజలంబులం గలపడుకు లూఁది ప్రభాతసమయోచితంబుగా వికసించు కమ్మనితమ్మియుం