పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/198

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 157

[1]క. ఔ లెండ యేటి మాటలు
మేలే యిది బ్రతికినట్టిమీఁదటఁగద యా
జోలి యెటులైన నైదవ
రాలై మనపడుచుగాఁగ నమరినఁ జాలున్. 150

క. అని చని యాయమ జననీ
జనకులకుం దెలుపు సంతసంబున వారల్
విని మనుమరాలుగావున
ననువారము దాని జారయని పిలుచుటయున్. 151

తే. ఊరివారెల్ల రావె యోజార యనఁగ
నదియె పే రయ్యె నాజార కంబుజాక్షి
యంత నది యింతయై యంతయై వినూత్న
పేశలాకారయై మించి పెండ్లి కెదుగ. 152

తే. అడుగవచ్చిన వార లయ్యబలరూప
శీలకులగుణవిఖ్యాతి చాల మెచ్చి
జారయనుపేరు విన్నంతఁ జాఱుటయును
బీఁట మీఁదిటిపెండ్లిండ్లు పెక్కు లెడసె. 153

చ. పొలుపుగ మోసులెత్తుచనుపూపలు ఱొమ్మున నిక్క నాఁకట
న్మలమలమాడఁగా జెఱఁగుమాసిన దోసము వచ్చునంచు న
గ్గలికలతల్లి కూడడఁగఁగట్టె మహీసురజాతిధర్మముల్, దెలు
పుచుఁ బెండ్లిపే రకట దేవుఁ డెఱుంగు మెఱుంగుబోఁడికిన్. 154

  1. క. పోలెండ యేటిమాటలు
    జాలిం బడనేల మనము సరగున దీనిం
    బోలంగ నొక్కతెఱఁగునఁ
    బాలింత మటన్న సతికిఁ బతి యిట్లనియెన్.

    క. బాల యిది యాయు వలరుచు
    మేలిమిగా బ్రతికినట్టి మీఁదటఁ గదయా
    జోలి యెటులైన నైదువ
    రాలై మనపడుచుగాఁగ నమరినఁ జాలున్.