పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120 శుకసప్తతి

దనబుద్ధి బొంకనేరని పంకజాక్షికి
ధవునివాకట్టు మంత్రంబుగాఁగ
తే. నమరు నవ్వీట నన్నపూర్ణాభిధాన
మదనమాయామహాస్థానమంత్రసాని
దానితో మాటలాడి చూతము విచార
మేల యని వేళగని దాని యింటికడకు. 518

చ. చని వరభద్రుఁ డల్ల గుణశాలిని జూచుటఁ దెల్పి దానిమో
హనమగు రూపమెంతకొనియాడెద నేడు దురంతకంతుకుం
తనిహతిఁజింతవంతఁబడితాంతలతాంతము చంద మొందె నా
తను విదె చూడు వేఁడుకొనెదన్ననుఁ గూర్పుము దాని నేర్పునన్. 519

క. నాకనఁగాఁ గనకము భౌ
మాకనుఁగొనఁ జిల్లపెంకు మాత్రము దానిం
జేకూర్చిన నాతనునిదె
నీకుం గైవస మొనర్తు నీతోడు సుమీ. 520

మ. [1]అని సూచించిన మంచిదంచు విని యయ్యబ్జాక్షినిం గూర్ప నా
తనికిం బాసయొసంగి వీడ్కొలిపి తత్కార్యార్థ మూహించి మో
హనుగేహంబునకుం బ్రయోజనశతవ్యాపారముల్ దెల్పికొం
చు నిరూఢంబగు రాకపోక లొనరించు న్మాయ డాయింపుచున్. 521

క. అంతట నాశుభవతి కది
యంతింతనరాని యంతరంగంబున నా
ద్యంతమధురోక్తచాతురి
సంతతము న్వింతసంతసం బెసంగించున్. 522

  1. అని తెల్పన్విని మంచికార్యమని పాఠాంతరము.