పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/95

ఈ పుట ఆమోదించబడ్డది


ఉ.

ఎట్టుగ నేఁగుదెంచితిరి యిందుకళాధర[1]భృత్యులార యీ
చెట్టదురాత్మునిన్ హరుని [2]చెంతకునుం గొనిపోవువారలై
యెట్టొకొ శంకరుం డొకని నెవ్వనినేఁ గొనితేరఁ బంపినం
బట్టఁగ [3]వచ్చినారొ తడఁబాటున వీని మతిభ్రమంబునన్.

60


సీ.

అని హేతువులును దృష్టాంతంబులును జూపి
          యమ(భృత్యు లియరైరి) యవనిసురుని
నూరకయుండె మృత్యువు నోర్ గదల్పక
          భవునిచే మును పడ్డపాటుఁ దలఁచి
వరుణపాశములచే [4]వ్యథితచేతస్కుఁడై
          సుకుమారుఁ డెంతేని స్రుక్కుచుండె
నెదురుచూడఁ దొణంగి (రీశ్వరయములును)
          తారు పంచినవారు తడయుటయును


గీ.

గాలయాపనమునకు నిగ్రహముఁ బూని
శంభుకింకరు లపు డవష్టంభ మెసఁగ
నౌడుగఱచుచు నప్పు డేకాంతముండి
సమధికంబైన సాహసోత్సాహ[5]వృత్తి.

61


ఉ.

బిత్తరి దండిమాట లిటు ప్రేలెదరే యమరాజుసేవకుల్
చిత్తజవైరియాజ్ఞ యొకచీరికి గైకొనకంచు నుద్ధతిన్
మిత్తిని వారినిం గదిసి నిర్భరభూరిభుజాబలంబునన్
మొత్తిరి [6]యుర్కి బాహువులు [7]మోడిచి పట్టి వృషాంకకింకరుల్.

62


క.

కడవసముల బ్రహరించిరి
యడిచిరి లాతముల మొత్తి రహివలయములం
బిడికిళ్ళను ఘట్టించిరి
తడఁబడ మృడుభటులు దండధరుకింకరులన్.

63


వ.*

(ఇట్లు) మొత్తువడి యమకింకరులు [8]శంకరకింకరులకుం బ్రతిఘటింపక సుకుమారుని బరివేష్టించి యమలోకంబున కభిముఖులై యతనిం గొనిపోవం దొణంగి రప్పుడు రుద్రాక్షమాలికావక్షఃస్థలుండును జంద్రార్ధకృతశేఖరుండును భస్మోద్ధూళితలలితాంగుండును ద్రిలోచనుండును [9]నతిప్రమాణకాయుడును నగు నీలలోహితప్రమథుండు కాలాంబుదధ్వానగంభీరంబైన కంఠస్వనంబున నిట్లనియె.

64


సీ.

పడసె నెవ్వని కృప బ్రహ్మ బ్రహ్మత్వంబు
          విష్ణుండు విష్ణుత్వవిభ్రమంబు
నీరేడుజగములు నెవ్వాని కుక్షిలో
          నొక్కఁడొక్కంటితో నొరయుచుండు
నంధకేభజలంధరాది దానవకోటిఁ
          గ్రాఁగించె నెవ్వాని కంటిమంట
యామ్నాయశాఖాసహస్రంబు లెవ్వని

  1. తా. భక్తులార
  2. తా. చేరువకుం
  3. తా. వచ్చినారు
  4. తా. వ్యథితమనస్కుడైఁ
  5. తా. మమర
  6. తా. యుల్కి
  7. తా. మోడ్చిరి
  8. తా. శంకరభటులకుం
  9. తా. అతిప్రమాణోపాయుండును