పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/91

ఈ పుట ఆమోదించబడ్డది


లింగమంగళమూర్తి ఖట్వాంగపాణి
యర్ధశశిమౌళి నాగేశ్వరాహ్వయుండు
ప్రతివసించు ననేకకల్పములనుండి.

36


వ.

ఆ శివరాత్రి పుణ్యకాలంబున.

37


సీ.

శివగంగఁ బుణ్యాభిషేకంబు దీర్చిరి
          దరి నొనర్చిరి [1]మూఁడు తర్పణములు
ధరియించి రంబునిర్ధౌతవస్త్రంబుల
          నాచరించిరి బ్రహ్మయజ్ఞతంత్ర-
మర్ఘ్యాంజలిక్షేషపణానంతరమ్మునం
          దొనరించి రంశుమంతున కుపాస్తి
గృహదేవతార్చనక్రియ లాచరించిరి
          యభ్యాగతులకు నర్హణలు నడిపి-


గీ.

రవని[2]సురులెల్ల నాగేశ్వరాలయమున
కేఁగుదెంచిరి ప్రణమిల్లి రీశ్వరునకు
(జాగరమునకు) నాలుగు జాలుఁ బూజ-
[3]కాదిసంకల్ప మొనరించి రభవు మ్రోల.

38


గీ.

ఆదరంబున సమ్మార్జనానులేప
ధూపపటువాసనలు తైలదీపములును
సంఘటించిరి వివిధసంస్కారవిధుల
బ్రాహ్మణులు నర్హులైనట్టి పౌరజనులు.

39


సీ.

కాంస్యతోరణమాలికలు సంఘటించిరి
          ప్రాసాదగోపురాభ్యంతరముల
రంభాతరుస్తంభసంభారములు సము-
          త్పాటించి రొగిఁ బ్రతిద్వారమునను
బూజోపకరణపాత్రీజాత మఖిలంబు
          సంస్కరించిరి భస్మసలిలశుద్ధిఁ
గరమొప్పు వృషభపుంగవకేతనంబులు
          నిలువంగఁ బెట్టిరి వలభులందుఁ


గీ.

గమలనీలోత్పలంబులుఁ గర్ణికార-
[4]మాలతీకుందములు హేమమరువకములు
మల్లికాకింశుకము లపామార్గవకుళ-
పాటలంబులుఁ గూర్చి రపారములుగ.

40


గీ.

అపుడు సుకుమారకాహ్వయుం [5]డపరసంజ
నేఁగుదెంచెను నాగేశ్వరేశు గుడికిఁ
బుష్పవాటికలోఁ [6]గమ్మపువులఁ గోసి

  1. పుణ్యతర్పణములు
  2. తా. బుధులెల్ల
  3. ము. నాది
  4. మాలతీందుక హేమాంబుమరువకములు
  5. ము. డదరువజ్జ
  6. తా. గొమ్మపువ్వు