పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/88

ఈ పుట ఆమోదించబడ్డది


కొనియెడి[1]యది కల్లు మనసు క్రొవ్వెట్టుడుగున్.

19


గీ.

కాంచె నిద్దఱు సుతుల నక్కామినులకు
వావి వర్ణంబు మాలిన వద రతండు
శాస్త్రములఁ జెప్పఁ[2]బడిన దోషంబు లెన్ని
యన్నియును జేసె నాతఁ డేమనఁగఁ గలదు.

20


వ.

అంత.

21


క.

హేమంతము శరదాగమ-
సామంతము [3]తుహినకణవిసంస్థులశబరీ-
సీమంతము మదనబల-
శ్రీమంతము [4]డాసె భువనసీమంతంబై.

22


మ.

బలసుల్ పండెను దొండముక్కు వడియెం బ్రాసంగుచేల్ పోఁకమో-
కల పూఁబాళలతావిఁ గ్రోలి [5]పొదలెం గౌబేరదిగ్వాయువుల్
ఫలినీవల్లిమతల్లివల్లరులపైఁ బైపై నలివ్రాతముల్
పొలసెన్ మంచులు రాలె రాత్రికరిణీఫూత్కారవార్బిందువుల్.

23


చ.

కలమవనాళికాకణిశకంటకకోటులచేతఁ జూడ్కి కిం-
పలవఱిచెన్ ధరిత్రి తుహినాగమవేళఁ దటాకసారణీ-
సలిలము వాఱి పండిన యజాంగలసీమము లెన్ని యన్నిటం
దలమగు సీతు పేర్మి గరు దాల్చిన భావము ప్రస్ఫుటంబుగన్.

24


క.

కలవింక కలకలాకుల
వలభీగర్భములు సౌధవాటములు పురం-
బులయందుఁ దుహిన[6]వేళలఁ
జలి [7]గులగులఁ గూయునట్టి చందంబొందెన్.

25


క.

పెనుఁజలి గడగడ [8]వణఁకుచు
వనదేవత [9]దంతవీణ వాయించెనొకో
యన మోకప్రేంకణంబుల
[10]ననగుత్తుల మొఱసె నలిగణము విపినములన్.

26


శా.

బింబోష్ఠీకుచకుంభభారము లురఃపీఠంబులన్ హత్తి మో-
దంబారన్ మృదుకేళిశయ్యల శుభాంతర్గర్భగేహంబులం
దాంబూలీదళ[11]పూగపూరితముఖుల్ ధన్యాత్మకుల్ శీతకా-
లం బెంతేనియు నిద్రవోదురు నిశల్ సంభోగలీలావధిన్.

27


సీ.

ధనదశుద్ధాంతకాంతాపయోధర[12]భార-
          సంవ్యానపల్లవస్రంసనములు
కైలాసగిరికూటకల్పద్రుమాటవీ-
          కుసుమగుచ్ఛరజోఽ[13]వగుంఠనములు
చంద్రభాగాసరిత్సలిలవీచీఘటా-
          ప్రేంఖోలికాకేళిరింఖణములు

  1. ము. దిది
  2. తా. బడ్డ
  3. ము. తుహినకణవిసంజ్ఞితశబరీ
  4. తా. సకలభువనసీమంతంబై
  5. ము. పొరలెం
  6. తా. వేళన్
  7. తా. కులంకుల
  8. తా. వడఁకుచు
  9. తా. దండవీణ
  10. తా. సనగుత్తులు
  11. ము. భాగ
  12. తా. భాస
  13. తా. వకుంఠనములు