పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది


జ్జ్యేష్ఠుం [1]డప్పుడు నిష్ఠురప్రదరబంహిష్ఠద్యుతిశ్రేష్ఠతన్.

6


వ.

ఆ దివసంబున.

7


ఉ.

జాతరచేసె బ్రాహ్మణుఁడు చండికిఁ గమ్మని పిండివంటతో
నేతులతోడ మద్దికడ నిర్మలినన్నాముతో రసావళీ-
చూతఫలాళితోడ వరసూపముతో జిఱువాలతోడుతన్
[2]నీతులతోడ నప్పు డకనిష్ఠతరంబగు నిష్ఠ పెంపునన్.

8


వ.

నాఁటిరాత్రి *(నిశా)సమయంబునఁ గాలకంఠకంఠమూల కాకోలవిషమషీ కళంకచ్ఛాయాసముల్లాసంబు *(నుల్లసనంబు) నుల్లసంబాడు నిబిడాంధకారంబున [3]నన్నెలవు గదలి చండాలియుం దానును సుకుమారుండు దుర్గమాటవీ[4]విషయంబు హూణదేశంబు గడచి ప్రతిదినప్రయాణంబుల నెడనెడం బక్కణ (గ్రామఘోషంబుల భిక్షాహార గోరస క్షౌద్రంబులనుం గందమూలంబులనుం గర్కంధూ[5]లికుచ కదలీ చూత మాతులుంగ లవలీ జంబూ తాల తిందుక ద్రాక్షాఫలంబులను శరీరయాత్ర నడుపుచు గంధసింధురఘటాకరటఫలక తటగళితమదజలాసారధారాసారిణీసంపర్క చంద్రకిత[6]బంధకిని యగు సింధురనది యుత్తరించి, యుత్తరాభిముఖుండై జంబూద్వీపవిశ్వంభరానితంబబింబ జాంబూనదమేఖలాపాశంబగు కాంభోజదేశం బతిక్రమించి, యభ్రంకష విశంకట శిఖరోత్సేధ బహులమహీధరస్కంధసంకులంబగు కిరాతమండలంబు పొత్తెంచి యందు బృందారకనగర సౌందర్యంబు ధిక్కరించు వైభవాధిక్యంబునం బ్రసిద్ధిగాంచి [కాంచీ]పట్టణంబునకుం జుట్టంబన నవంతికి సామంతంబన మధురకుం బ్రతియన మాయకుం బ్రతిచ్ఛాయనా నయోధ్య కధ్యాహారంబన ద్వారవతికిం బ్రతియన గాశికిం గీసవెలితియన నొప్పు వణిక్పథంబను [మ]హానగరంబు ప్రవేశించి.

9


ఉ.

ఎంతయుఁ గాల ముండెను మహీసురుఁ డప్పురియందు వేదవే-
దాంతపురాణతత్వవిదులైన ధరామరు లుద్ధరింపఁగా
శాంతియు దాంతియుం ధృతియు సత్యము శౌచము బాహ్యవృత్తి య-
భ్యంతరవృత్తి ధౌర్త్యమును బాయక యెప్పుడు జెల్లుచుండఁగన్.

10


గీ.

బ్రహ్మపురివాడలో వణిక్పథమునందు
జరిగె సంస్పృష్టిదోషంబు జరభి కతన
నెవ్వ రేలాగువారొ యెట్లెఱుఁగవచ్చు
జగతిఁ గల [7]దిజ్యదోష మజ్ఞానకృతము.

11


గీ.

విభవముల [8]వడ్గు పెండ్లిండ్లు విందు వీడు
భోజన ప్రతిభోజనమ్ములను వ్రతము-
లాదిగాఁ గల తిథులందు నతనిఁ గూడి
వ్య[వ]హరించెను వీట బ్రాహ్మణకులంబు.

12


గీ.

నెలత బొమ్మంచు పుట్టంబు నెఱిక గట్టు
కాంత ధరియించు పచ్చనక్షకల బొట్టు
నింతి యొడికంబుగా వాడు నిల్లుబట్టు
వీటి విప్రాంగనలు దన్ను వినుతి సేయ.

13


సీ.

కృపకు నాధారంబు కీర్తి కావాసంబు
          దానధర్మముల కాధానకంబు
మూలంబు కాంతి కావాలంబు దాంతికి
          నఖిలవిద్యలకును నాలయంబు

  1. తా. డర్కుఁడు
  2. తా. నేతుల
  3. తా. నన్నెలవులం గదలి
  4. తా. విషయంబునుంగా
  5. తా. వితికుచ
  6. తా. బంధకిణియగు
  7. ము. దిజ్జ
  8. తా. వడుగు