పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/78

ఈ పుట ఆమోదించబడ్డది


మాలిని.

సరససుఖవినోదా సారశైవార్థమోదా
పరమపదవివేకా భానుతుల్యప్రభాకా
ధరణిధరసుధైర్యా దండసంగ్రామశౌర్యా
నిరుపమగుణధామా నిత్యకల్యాణసీమా.

145

గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర *(సకలవిద్యా
సనాథ) శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రి మాహాత్మ్యంబునందుఁ
దృతీయాశ్వాసము.