పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది


దరణిబింబహారిద్రవార్ధరముతోడ
లలితరుచి నొప్పు నాకాశలక్ష్మివోలె.

76


గీ.

పల్లవాధర మడుఁగైన యొల్లెఁ గట్టెఁ
గొంగు మణిహేమకంఠికాకోటిఁ జెరివి
సొబగుఁ గాటుకబొట్టుతోఁ జూడనొప్పె
వింతచెలువునఁ బచ్చిబాలెంత[1]రాలు.

77


ఉ.

[2]రక్షకుఁ బుండరీకనఖరంబు సువర్ణలతానిబద్ధమున్
వక్షమునన్ ధరించి సచివప్రియసూనుఁడు చూడనొప్పె ను-
గ్రతతిసంభ్ర మోద్ధతిగ [3]గాఁడి విడంబితమైన [మర్త్య]హ-
ర్యక్షుని గోరు పేరురమునందు ధరించిన దైత్యు కైవడిన్.

78


గీ.

రత్నవేదికపై మంత్రిరాజసుతుఁడు
తల్లిహృదయంబు [4]దృష్టియు తన్నుఁ గొలువ
[5]ఫాలతలమున రావ్రేక పరిణటింప
జానుచంక్రమణక్రీడ సంచరించె.

79


మ.

వలిచన్నుల్ వడఁకాడ వేనలులు గైవ్రాలంగ గారాపు దా-
దులు తన్నేమఱ [6]కంతనంత దిరుగన్ ధూర్తుండు తా నుద్ధతిన్
గలకాంచీమణికింకిణీకలకలా[7]త్కారంబు తోరంబు గాఁ
గలహంసంబులఁ బట్టఁ [8]బాఱుసు వడిం [9]గక్ష్యావిభాగంబులన్.

80


వ.

అంత [10]నా సుకుమారుడు నత్యంతసంతోషవంతులగు తలిదండ్రుల మనోరథంబు ఫలియింప ననుదినప్రవర్ధమానుండై వర్ధమానసంపదనురూపంబు[11]లగు నైశ్వర్యానుభవంబులు గలిగి క్రమంబునఁ గృతచౌలోపనీతుండై యాచార్యగృహంబున కరిగి.

81


సీ.

చదివె వేద మెఱింగెఁ బదము [12]వాక్యంబుఁ బ్ర-
          మాణంబు దివ్యాగమములు చూచెఁ
దరచె నాదిపురాణధర్మశాస్త్రంబులు
          నేర్చె వీణావేణునృత్యకళలు
వాదనశ్యాంజన[13]వదనికాదులును జూ-

  1. ము. యపుడు
  2. ము. అక్షయవర్ణితాఖ్యుఁడు గరంబు(?) సువర్ణ;
  3. ము. ని గాండివధన్వుని తండ్రియౌ సహస్రాక్షునివైరి పేరురమునందు
  4. ము. దృష్టులు
  5. ము. సకలజనులును బంధులు సంతసింప
  6. ము. కంతలంతలను వేడ్కల్ మీఱి చూడంగఁ దాఁ
  7. తా. రావంబు
  8. తా. జారువడినిం
  9. తా. కక్ష్యాది భాగంబులన్
  10. తా. ననంతసంతోషాక్రాంతస్వాంతులగు దంపతుల
  11. ము. గఁ గుమారత్నంబునకుఁ గ్రమ
  12. ము. వక్కాణించె మహనీయ
  13. ము. వదనికాదులు జూదమాడంగ నెఱిఁగెను మదనశాస్త్ర; తా. వదనికాదులును జూదంబు గణితశాస్త్ర ముద్రంబు దెలిసె