కటకఝణత్కార మెసఁగ గరపద్మము[1]లన్.
మృదులగోధూమసరులతో మేలవించి వన్నెకుచ్చుల పేరుతో [2]వక్కరించి పుష్పడుండుభకంబుతోఁ బొత్తు [3]వడసి బడఁతి పాలిండ్లపై [4]నొప్పె పసిఁడిపేరు.
తగవులిచ్చిరి [5]పుట్టింటితల్లి ప్రజలు వీళ్ళొసంగిరి చుట్టాలు వేనవేలు [6]కట్టనిచ్చె నృపాలుండు కన్నుదనియఁ బరమహీపాలురిచ్చిరి పావడములు.
క్ష్మామండలము తురంగమధట్టమయమయ్యెఁ గరిమయంబయ్యె దిక్చక్రవాళ- మంబరం బాతపత్రావళిమయమయ్యె సౌరభమయమయ్యె మారుతంబు పరివారమయమయ్యె బ్రహ్మప్రపంచంబు జయశబ్దమయమయ్యె సకల[7]జగము- లాత[8]పంబు విభూషణాలోకచయమయ్యె సంతోషమయమయ్యె జనులమనము
వింధ్యపర్వత మేలు పృథ్వీవరుండు దానుఁ బట్టంపుదేవియుఁ దగవుగలిగి సచివునింటికి [9]నేతెంచి సమ్మదమున నొద్దనుండి యా శోభన మొనరుచుటయు.
[10]జవిలె నరఁబూలు ముడిచిన సాధ్వి యొకతె [11]యోలగందంపుఁ బసపున నూన్చెఁ గదిసి పసిఁడి యుత్తర[12]జందెముల్ [13]పాయఁబట్టి రాచప్రెగ్గడ బ్రహ్మసూత్రమున నగుచు.
దశరథుని వాజపేయంబు ధర్మసూను రాజసూయంబు నుపమింపఁ [14]బ్రాఁతియె యని [15]పట్టణంబును దేశంబుఁ బరిఢవింప