పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

[1]అల్లనల్లన మెలఁగుఁ బద్మాయతాక్షి
సముదితంబైన గర్భభారము కతమున
సమ్యగాపీతజలరాశిసలిల[2]మైన
ప్రావృడారంభనవమేఘపంక్తి వోలె.

51


శా.

[3]సీమంతోన్నయనంబుఁ బుంసవనముం జేయించె శ్రీయజ్ఞద-
త్తామాత్యాగ్రణి[4]చే నృపాలకుఁడు వింధ్యాధీశ్వరుం డర్మిలిన్
సామంతక్షితిపాలమంత్రు లసమానంబైన ప్రేమంబునన్
భామా[5]హేమతురంగరత్నములు పైపైఁ బావడల్ దేరఁగన్.

52


సీ.

కమ్మగొజ్జఁగి నీటఁ గలయంపి చల్లిరి
          [6]మేఁగి మెత్తిరి క్రొత్త మృగమదమున
రంగవల్లులు కప్పురపు [7]ధూళిఁ దీర్చిరి
          [8]కీరించి రొగి మాల్యతోరణములు
తరుణరంభాతరుస్తంభంబు లెత్తిరి
          కట్టి రెల్లెడఁ బట్టు కలువడములు
కమలచందనమాలికలు [9]వినిర్మించి రు-
          త్తంభించి రున్నతధ్వజపతాక-


గీ.

[10]లాలిఖించిరి గేహకుడ్యములయందు
సర్వతోభద్రమకరికాస్వస్తికములు
పరిజనంబులు రాజాజ్ఞఁ బట్టణమున
యజ్ఞదత్తుని ప్రథమకళ్యాణవేళ.

53


గీ.

[11]వేడ్క నృత్యంబు లాడిరి వీథులందుఁ
బాడి [12]రెత్తిలి పికకుహూపంచమమున
[13]బంజళంబున ధవళప్రబంధగీతి
[14]కనుమ యవ్వలి కర్ణాటకమలముఖులు.

54


మ.*

అదనన్ వచ్చిరి సంభ్రమంబునను బంచారామలీలావతుల్
పదునాల్జాతుల యప్సరోంగనలునుం బాలిండ్లపై హారముల్
గదలం బెన్నెఱి సేసకొప్పులపయిం గహ్లారగుచ్ఛంబులొ-

  1. ము. అట్లు ధవునొద్ద
  2. తా. యైన
  3. ము. సీమంతోన్నతసంభ్రమంబు వెలయం
  4. ము. కన్నృపాలకుడు. తా. కిన్
  5. ము. సింధు
  6. తా. మ్రోకువెట్టిరి
  7. ము. మ్రుగ్గు వెట్టిరి
  8. తా. దోరించి రొగిఁ దల్యతోరణములు
  9. ము. ను నిర్మించిరి, స్తంభించి రుత్తమదర్పణములు
  10. తా. అభిలిఖించిరి
  11. తా. వెలఁదివెన్నలఁ బ్రాసాదవీథులందు
  12. తా. రొత్తిలి
  13. తా. పంజరంబున
  14. ము. కముల నవ్వేళ