పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/40

ఈ పుట ఆమోదించబడ్డది


          గావించు [1]నతి దిశాదేవతలకు
వాయసంబులకు నిర్వర్తించు దధిబలిఁ
          గొలుచు జ్యేష్ఠాదేవి నలఘుమహిమఁ
జదివించుకొనుఁ బుణ్యసంహితావ్రాతంబు
          మూలికామాణిక్యములు ధరించుఁ
[2]దాంబూలగంధాక్షతలు చిరంటుల కిడు
          [3]విప్రశ్నికల గారవించుఁ దఱచుఁ


గీ.

గుమ్మరావంబు కడవలు కొల్లవిడుచు
బాలురకుఁ దియ్యపండులు పంచి యిచ్చుఁ
జెలులుఁ దానునుఁ [4]రేలు పోచిళ్ళువోవుఁ
దామరస[5]నేత్ర పుత్రసంతానకాంక్ష.

40


వ.

ఇవ్విధంబునఁ [6]బుణ్యోపవాసవ్రతదానధర్మదేవతారాధనంబు[7]లఁ బ్రతిబంధదోషంబులుం బాసిన [8]నా సుశీలాదేవియందుం బ్రతిమాచంద్రబింబంబు సరసియందునుం బోలె గర్భం బావిర్భవించిన.

41


సీ.

అభ్యంతరస్థాగ్నియగు శమీలత వోలె
          నిధిగర్భయగు నబ్ధి[9]నేమి వోలె
[10]నంతస్స్థదిగ్దంతియగు వియన్నది వోలె
          శశికుక్షియగు నస్తసంధ్య వోలె
నాలీనహర్యక్షయగు నద్రిగుహ వోలె
          వినయధారిణి యగు [11]విద్య వోలె
[12]జలదాంతరితయగు నళినాప్తరుచి వోలె
          సూనృతాభిధయగు సూక్తి వోలె


గీ.

నాదిమబ్రహ్మసంభరితోదరయగు
కైటభారాతినాభ్యబ్జ[13]కళిక వోలె
నధిగతాగస్త్యయగు దక్షిణాశ వోలెఁ
బ్రథమగర్భంబు ధరియించెఁ బల్లవోష్ఠి.

42


గీ.

[14]పలుచఁ బాఱెను గండదర్పణయుగంబు
నవమధూకప్రసూనంబు [15]నవమధుకర
[16]మానుగతిఁ జూచుకంబులు నసితమయ్యె
సవతి పూఁబోండ్ల యాననాబ్జములతోడ.

43
  1. ము. నతిథిసత్కారములను
  2. ము. దన్వంగి
  3. తా. విప్రకన్యల
  4. ము. వ్రతములు సలుపుచుండు
  5. తా. నేత్రి
  6. తా. పుణ్యవ్రతోపవాస
  7. తా. లు
  8. ము. నా సుదతీలలామంబు మెఱసి
  9. ము. నిలయ
  10. తా. నసమగ్న
  11. ము. వినత
  12. ము. నస్తాంతరితయగు
  13. ము. కమును బోలె
  14. తా. పలచ
  15. తా. నవమతించె
  16. తా. నాతి కుచచూచుకంబులు