పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది


గంధదంతావళక్రవ్యాదరాట్కృత్తి-
          కంథాధురంధరకంధరుండు
కుంభినీధరసుతాకుచకుంభమృగమద-
          స్థాసకస్థగితవక్షస్థలుండు


గీ.

శంభుఁ డోంకారనాథుండు శాశ్వతుండు
పాయకయ యుండు నవ్వీటి పరిసరమున
నర్మదా సింధుతీర కాంతారభూమి
మఱ్ఱి యను పేరి కల్పద్రుమంబు [1]నీడ.

6


వ.

అప్పట్టణంబునకుం జుట్టును జనపదంబు [2]లైరావతీశతద్రూ విపాశాసింధునదీమాతృకంబులును, విశ్వవిశ్వంభరాభ్రూలతానుకారిసేతురేఖాలంకారంబులును, దటాకతరుకుసుమకేసరక్షర దమందమకరందధారాధోరణీసహస్ర[3]సంవర్ధితకుల్యా సలిలకల్లోలమాలికా[4]స్ఫుటస్ఫాయత్కాయమాన నానావిధోద్యానవాటికాసంఘటితాకాలకాలాంధకారంబులును, నారామచూతపోతనికరసుకుమార కిసలయాస్వాదకషాయకంఠ కలకంఠకామినీ కోమలకుహూకార కోలాహలాంకురిత పంచమరాగరాజంబులును, రాజాన్నకలమషాష్టిక పతంగ[5]ప్రియ నానావ్రీహిసస్య[6]ప్రశస్తంబులును, బ్రవర్ధమానవనంబులును, [7]నిబిడిత సారసికంబులును, గుళుత్థాభ్యుత్థానంబులును, సముద్గతముద్గసామగ్రీసంగ్రహంబులును, [8]అణుకచణకచణంబులును, సిద్ధార్థ [9]శ్యామాక గోధూమ [10]గర్ముత్తిలజర్తిలంబులును, అదూషిత [11]మాషకోరదూషితకోన్మేషంబులును, [12]కుసుంభకుసుమగుచ్ఛచ్ఛాయాచ్ఛటా[13]భ్యంగణ శోణభంగోమాణుశృంగారిత జాంగలక్షేత్రంబులునునై దాశరథి[14]చరిత్రంబునుం బోలె సీతావృత్తి[15]సరళంబును, జంద్రోదయంబునుం బోలెఁ గరసహస్రసంవర్ధిత[16]రత్నాలయంబును, యదువంశంబునుం బోలెఁ గులక్రమాగత శూరపురుషోత్తమ బలాభిపాలితంబునునై యుండు వెండియు.

7


మ.

పరలోకస్థు [17]బతిన్ ఝుషాంకు బ్రతికింపంగోరి యోంకారశం-
కరు మ్రోలన్ రతి [18]ముక్తకంఠముగ నాక్రందించునా [19]నొప్పు న-
ప్పురబాహ్యోపవనాంతదీర్ఘికల (రేపున్ మాపు వీతెంచు) పు-
ష్కరకింజల్కభుజిక్రియాసుఖితహంసక్రేంక్రియారావముల్.

8


మ.

ధరణీచక్రమువోలె నప్పురము విస్తారంబు నాయామముం
బరికింపంగ నశక్యమైన గరిమం బాథోధిగంభీరతం
బరిఖామండల మంబురాశి నుపమింపం బాత్రమై యొప్పు నం-
బరకల్లోలలుఠత్తిమింగిలఢులీమత్స్యాహినక్రోద్ధతిన్.

9
  1. ము. మొదల
  2. ము. తా. లీలావతీ శతద్రు విపాట్సింధు
  3. తా. సువర్ధిత
  4. తా. స్ఫాల
  5. తా. ప్రాయ
  6. తా. ప్రస్థంబులును
  7. తా. నిపీడితకాసారసేకంబులును
  8. తా. సనకోచణకచణకంబులును
  9. తా. శ్యామ
  10. ము. శర్మరాతిల
  11. ము. మహాకోర
  12. ము. కుస్తుంబురు
  13. ము. భృంగ
  14. తా. చరిత్రంబులనుం బోలె
  15. తా. సరళంబులును
  16. తా. రత్నాలయంబులును
  17. తా. మదిన్
  18. తా. కంఠముక్తముగ
  19. తా. నప్పురీ-పురబాహ్యోపవన