పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/31

ఈ పుట ఆమోదించబడ్డది


శివరాత్రి[1]వ్రతదర్శనంబున శివపురంబునకుం జనియె ననిన శౌనకాదు లక్కథకున కిట్లనిరి.


గీ.

అద్భుతం [2]బయ్యెడిని మాకు నగ్రజన్ముఁ
డెట్టు పాతకములు సేయు టెట్టు [3]లట్టి
పాపి శివరాత్రివ్రత మెట్టు పరఁగఁ జూచె
నంతయును విస్తరింపుమా [4]యనినఁ బ్రీతి.

120


శా.

జీమూతాన్వయరాజధైర్య సుమహాక్షీరాబ్ధిగాంభీర్య [5]సు-
శ్రామప్రోద్భవగాఢశౌర్య సుమనోధన్వాతిసౌందర్య పౌ-
లోమీనాయకతుల్యభోగయుత [6]సుశ్లోకద్రుజిత్త్యాగ భా-
షామాధుర్య మతిప్రకాశధిషణా సత్యార్హసంభాషణా.

121


క.

నిత్యయశశ్శ్రీసుందర-
మత్యమరాచార్యవర్య మాన్యచరిత్రా
భృత్యజనావనతత్పర
సత్యహరిశ్చంద్ర సరససాహిత్యనిధీ.

122


మాలిని.

అమితహితసుభాషా స్వాంతవిద్యావిశేషా
సమరముఖదిలీపా చంద్రకందర్పరూపా
కమలనయ[న]వీర్యా కాంచనాహార్యధైర్యా
విమలరుచిరకీర్తీ విశ్రుతానందమూర్తీ.

123

గద్యము
ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యా
సనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన
శివరాత్రిమాహాత్మ్యంబునందుఁ
బ్రథమాశ్వాసము.

  1. తా. వ్రతం బాచరించి
  2. తా. బది నీవు మాకు
  3. తా. లిట్టిపాటి
  4. తా. కనిన
  5. తా. సు-త్రామాత్మోద్భవ
  6. తా. సుశ్లోకచ్ఛటాభూష. ము. సుశ్లోకారిజిత్త్యాగ