పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది


గ్రతువైరి నీకు నే వ్రతముఖ్య మొనరింపఁ
          గౌతుకోన్మేషంబు గలిగియుండు


గీ.

నంధకాసురదమన నీ కభిమతంబు
లే యనుష్ఠానములు శర్వ యే మఖంబు
లాచరించిన [1]నీ వారమగుదు మట్టు-
లభవ దాక్షిణ్యపరత మా కానతిమ్ము.

114


వ.

అనినఁ [2]బ్రీతచేతస్కుండై *(శివుండు) విశ్వంభరాంభోరుహసంభవుల కిట్లనియె.

115


మ.

అవధానంబున నాకు [3]సత్ప్రియము సేయన్ సర్వదా మీకు [4]స-
ద్వ్యవసాయం బొడఁగూడెనేని వినుఁడా యంభోజదృగ్భారతీ-
ధవులారా విని యాచరింపుఁడు మదిం దాత్పర్య మొప్పంగ శ్రీ-
శివరాత్రివ్రత మస్మదీయ మది దాక్షిణ్యంబునం చెప్పితిన్.

116


వ.

బ్రాహ్మముహూర్తంబునందు మేల్కని శౌచక్రియలు నడపి గురున కభివాదనంబు సేసి సంకల్పంబు నడపి పూజోపకరణద్రవ్యంబులు సమకూర్చుకొని [5]నదీస్నానం బొనర్చి నిత్యనైమిత్తకాద్యనుష్ఠానంబులు దీర్చి [6]యలంకృతుఁడయి [7]యజనస్థానంబును సమ్మార్జనలేపనాదుల శోధించి వితానధ్వజంబు లెత్తించి [8]పతాకావలులు *(గట్టి) తోరణంబులు [9]సంఘటించి (కదలీఫల పూగఫల పనసఫల నారికేళంబులు తోరణంబులుగాఁ గట్టి) దేవాలయంబు ప్రవేశించి మౌనియై భసితత్రిపుండ్రంబును భస్మోద్ధూళనంబును గావించి రుద్రాక్షమాలికలు ధరియించి శివభక్తుల రావించి గురూపదేశమార్గంబున [10]నాసనంబుఁ బాద్యం బర్ఘ్యంబు [11]మధుపర్కంబు నిచ్చి [12]పంచవదనంబులుఁ బంచామృతంబుల నభిషేకించి ఫలోదక పుష్పోదక గంధోదక కుంకుమోదక రత్నోదక కర్పూరోదకంబుల నభిషేకించి వస్త్రం బుపవీతం బాచమనంబు గంధంబు భూషణంబు పుష్పంబు ఫలాహారంబు నీరాజనంబు ధూపంబు వ్యజనంబు వాదిత్రంబు దర్పణంబు స్తోత్రంబు మొదలుగాఁ గల [13]షోడశోపచారంబుల నుపచరించి నాలుగుజాములును జాగరంబు సేయునది. (ఇది శివరాత్రి) వ్రతచర్యప్రకారంబు.

117


గీ.

బ్రహ్మహత్యాయుతము సురాపానశతము
వీరహత్య గోహత్యలు వేనవేలు
శిశువధంబు [14]జనంగమ [15]స్త్రీనిషేవ-
మాదియగు పాపములఁ [16]దోలు నభవురాత్రి.

118


వ.

తొల్లి యొక్క బ్రాహ్మణుండు మహా[17]పాపంబులు సేసి (సర్వజనంబులచేత నిందితుడై యొక్క)

  1. ము. నీ వారమగుట యట్లు
  2. తా. బ్రచేతస్కుండై
  3. ము. సంశ్రయము
  4. ము. నధ్యవసాయం
  5. ము. నదీస్నానంబు వొనర్చి
  6. తా. యలంకృతులై
  7. తా. అజనస్నానంబున
  8. తా. ఫలావలులు
  9. తా. గాఁగట్టి
  10. తా. నాసనార్ఘ్యపాద్యంబుల
  11. తా. మధుపర్కంబిచ్చి
  12. తా. పంచవదను
  13. తా. యశేషోపచారంబుల
  14. తా. ను జంగము
  15. ము. శ్రీవినాశ. తా. స్త్రీనిషేధ
  16. తా. బొల్చు
  17. తా. పాతకంబులు