పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/25

ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

విని యెఱుంగవె కల్పాంతవేళ నేను
దంభ[1]కోలావతార ముద్ధతి వహించి
సర్వసర్వ(ంసహాతలచక్ర)[2]భరము
దాల్చినాఁడను దంష్ట్రికాదండకోటి.

83


శా.

ఏలా వచ్చెదు డాయ నెవ్వఁడవు నీ వెచ్చోటికిం బోయె [3]ది-
ట్లేలా మ్రొక్కవు నాకు గర్వమిఁక నెంతే నోర్వ[4]కుందుం జుమీ
త్రైలోక్యాధి[5]పుఁడన్ సురాసురశిరోరత్నప్రభామండలీ-
వ్యాలీఢాంఘ్రిసరోరుహుండ విడు గర్వారంభసంరంభమున్.

84


గీ.

అని వసుంధర నుద్ధరించిన బలంబు
భువనసర్గం బొనర్చిన పూనికయును
గారణంబులుగాఁగ నాగ్రహము పూని
యచ్యుతుండు నజుండు గర్వాంధులగుచు.

85


వ.

[6]ఒండొరుల నెఱింగియు నయ్యిద్దఱు మహేశ్వరు *(మాయా) ప్రభావంబున.

86


గీ.

నన్ను గెల్చికదా నీవు నలిననాభ
యఖిలలోకేశ్వరుఁడ వౌట యనియె బ్రహ్మ
నన్ను గెల్చికదా నీవు నలినగర్భ
యఖిలలోకేశ్వరుఁడ వౌట యనియె శౌరి.

87


వ.
  • (అని యవష్టంభవిజృంభణమున).
88


గీ.

ఇందిరానాయకుఁడు శార్ఙ్గ మెక్కువెట్టె
గాండివము సజ్యముగఁ జేసెఁ గమలభవుఁడు
శరములిద్దఱుఁ గాలాగ్నిసన్నిభంబు
లేసి రొండొరుపై శౌర్య మెసక మెసఁగ.

89


మ.

జవ మేపా[7]ర మురారిపద్మజ భుజాచక్రీభవచ్ఛార్ఙ్గగాం-
డివకోదండవినిర్గత[8]ప్రబలసందీప్తాస్త్రసంఘాతముల్
భువనక్రోడము నిండి భానుకిరణంబుల్ దూఱనీకుండుటం
బవలుం బర్వె మహాంధకారములు పైపై సూచినిర్భేద్యముల్.

90


గీ.

గాండివము తేరిపైఁ బెట్టి కమలభవుఁడు
శార్ఙ్గమున నచ్యుతుం డేయు సాయకములఁ
గర్కశంబైన కుశపూలకమున [9]వ్రేసి

  1. ము. క్రోడా
  2. ము. సరణి
  3. ము. దీవేలా
  4. తా. కుండం జుమీ
  5. తా. పతిన్
  6. ము. ఒండొరు నెఱింగిన యయ్యిద్దరు
  7. ము. రి
  8. ప్రభల
  9. తా. నేసి