పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/23

ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇవ్విధంబునఁ బ్రళయసలిలోపద్రవం బు[1]డిపి ధాత్రిఁ [2]బూర్వస్థానంబున సంస్థాపించి సర్వసర్వంసహాభార*(వహనం)బునం బ్రభవించిన ప్రయాసఖేదం బుజ్జగించుట[3]కయి పాఁపసెజ్జపై మున్నీటి నట్టనడుమం బవ్వళించి నారాయణుడు నిజాంతర్గతంబున.

72


శా.

దుర్వారోద్యమభంగి దంష్ట్రికతుదిన్ దూరంబుగా [4]నెత్తి యేఁ
బూర్వస్థానమునందుఁ బెట్టితి యథాపూర్వంబుగా నిప్పుడీ
యుర్వీమండలి నెట్టివాఁడనొకొ యోహోయంచుఁ జిత్తంబునన్
గర్వించెన్ మధుకైటభాంతకుఁ డు[5]దన్వద్వారిమధ్యంబునన్.

73


గీ.

అంత నిటఁ దానతానగు నబ్జభవుఁడు
దంభ[6]కోలావతారుఁడు ధాత్రి [7]యెత్తఁ
జాగెఁ బ్రారబ్ధమార్గానుసారమునను
మొదలుకొని యెల్ల విష్టపములు [8]సృజింప.

74


వ.

[9]మహత్సర్గంబు *(భూతసర్గంబు వైకారికసర్గంబును నను) బుద్ధిపూర్వకంబులగు మూఁడును బ్రాకృతసర్గంబులు; ముఖ్యసర్గంబు, తిర్యక్సర్గంబు, దేవసర్గంబు, మానుషసర్గంబు, గ్రహసర్గంబును నా [10]నైదును బుద్ధిపూర్వకంబులు వైకృతసర్గంబులు; కౌమారసర్గంబు ప్రాకృతసర్గంబు. ఈ తొమ్మిదియు నసాధకంబులు సాధకత్వంబును నైహికాముష్మికహితాహిత తదుపాయ తత్ప్రతికారవిరహితంబునం జేసి [11]యప్రయోజనంబులగుట నీ తొమ్మిది సర్గంబులవలనను బ్రయోజనంబు గానక కనకగర్భుండు మహేశ్వరునిం బ్రస్తుతించి తత్ప్రసాదంబునం బురాణప్రజాపతుల *(కశ్యప)మరీచిభృగ్వాంగిరస పులస్త్యపులహక్రతుదక్షవసిష్ఠుల మానసంబునం దొమ్మండ్రను ధర్మాధర్మసంకల్పంబుల మూఁటినిఁ గూడఁ బన్నిద్దఱు పుత్రులఁ గాంచె. ఆ పన్నిద్దఱవలననుం బండ్రెండు దివ్యవంశంబులు ప్రజావంతంబులుఁ గ్రియావంతంబులునై ప్రవర్తిల్లె; నందు *(దేవ)దైత్యదానవముని యక్షగరుడగంధర్వ కిన్నరకింపురుష సిద్ధవిద్యాధర కర్మదేవతాప్సరఃకామినీ రక్షోభూతపిశాచ మనుష్య పశుపక్షిమృగోరగకీటక గిరిగ్రావ వృక్షలతాగుల్మాదులును, గాయత్రీ త్రిష్టుప్సామరథంతరంబులును, అగ్నిష్టోమహయమేధ వాజపేయాతిరాత్ర పౌండరీకాదులు లోనుగా గలుగు చరాచరంబులు ప్రాజాపత్యాంగోపాంగప్రత్యంగంబుల జన్మించె; నివ్విధంబున నఖిలప్రపంచంబు నిర్మించి విరించి నిజాంతర్గతంబున.

75


ఉ.

ఏ నధికుండ నాకుఁ బ్రతి యెవ్వరు నిర్జరకోటిలోన నేఁ
[12]గాని జగత్ప్రపంచపరికల్పన సేయఁగలేఁడు తక్కొరుం
డే నఖిలేశ్వరుండనని యెవ్వరునుం బ్రతికోటిలేమిఁ దాఁ
దాన యహంకరించెను విధాత సదా[13]శివు మాయపెంపునన్.

76


వ.

ఇవ్విధంబున నవష్టంభంబు గైకొని యంభోరుహసంభవుండు తాను సృజియించిన భువన(భవనం)బులు వీక్షింపందలంచి రాయంచ[14]తే రెక్కి దిక్కులఁ జరించువాడు ముందట.

77
  1. ము. ఁదీర్చి
  2. తా. నుద్ధరించి
  3. తా. నై
  4. ము. నైతి
  5. తా. హృద్యద్వారి
  6. ము. క్రోడావతారుఁడై. తా. కోలావతారుఁడై
  7. ము. యెత్తి, సాగె
  8. తా. సృజించె
  9. తా. మహత్సర్గంబు నాను
  10. ము. నేడును
  11. తా. నిష్ప్ర
  12. తా. గాన
  13. తా. శివ
  14. తా. నెక్కి