పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది


డేతెంచిన సంప్రహృష్టమానసు లయి యమ్మహామును లాసనార్ఘ్యపాద్యాదులం బూజించి యతని కిట్లనిరి.

50


సీ.

సర్వజ్ఞ రోమహర్షణతనూభవ సూత
          యఖిలపురాణవిద్యాప్రగల్భ
పంచావయవయుక్త భవ్యకావ్యవిదగ్ధ
          యాశ్చర్యహేతువులైన కథలు
[1]రత్నాకరమునందు రత్నంబులునుబోలెఁ
          గలవు నీయందుఁ బొగడ్త గాదు
నీ వెఱుగని విద్య లీ విశ్వమున లేవు
          తర్కించి యెన్నివిధములఁ జూడ


గీ.

నుత్తరోత్తర [2]సత్కృత్య మొప్పు నీకుఁ
గాలనిర్ణయకలన నీ కరతలంబు
పూర్వమున మేము సేసిన పుణ్యమెల్ల
ఫలితముగ [3]నేఁగుదెంచితే ప్రార్థనంబు.

51


వ.

వేదంబులు నాలు గంగంబు లాఱు మీమాంసాన్యాయ విస్తరపురాణ ధర్మశాస్త్రంబు లాయుర్వేద ధనుర్వేదంబు లర్థశాస్త్రంబు లను నష్టాదశవిద్యానిధానంబులకు నాదికర్త సదాశివుం డా శూలపాణి యమ్మహాస్థానంబులు బ్రహ్మ కుపదేశించె. అనంతరంబ శంకరాజ్ఞాప్రచోదితుండై కృష్ణద్వైపాయనాభిధానంబున ననాదినిధనుండు పుండరీకాక్షుండును, నరణియందు వైశ్వానరుండునుం బోలె ద్వాపరాంతంబున సత్యవతియం దావిర్భవించె. వేదార్థోప[4]బృంహణార్థంబు సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితంబు లను పంచలక్షణంబులం గలిగి [5]బ్రాహ్మంబు వైష్ణవంబు శైవంబు భాగవతంబు భవిష్యంబు నారదీయంబు మార్కండేయం బాగ్నేయంబు పాద్మంబు బ్రహ్మకైవర్తంబు లైంగంబు వారాహంబు స్కాందంబు వామనంబు కౌర్మంబు మాత్స్యంబు గారుడంబు బ్రహ్మాండంబు నను మహాపురాణంబులు పదునెనిమిది గల్పించె నవియు.

52


గీ.

గ్రంథసంఖ్యఁ బురాణసంఘంబు గూడి
[6]నాల్గు లక్షలౌ నీ పురాణములలోన
నూఱువేల్గ్రంథములలోన నుతి వహించి
శ్రీమహాస్కాందసంహిత శివునిఁ జెప్పు.

53


వ.

అందు శివరాత్రిమాహాత్మ్యంబు చెప్పంబడి యుండు; నమ్మహావ్రతం బెట్టి దెవ్వ రాచరించి రే ఫలంబు నొసంగు మాకుం బరిపాటి తేటపడ వివరింపుమనిన నక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె.

54


ఉ.

తాపససార్వభౌములు సదాశివరాత్రిమహావ్రతంబు [7]దో-
షాపహృతిక్షమంబు వినుఁ డాదరణంబున నేను సద్గురు
శ్రీపదపద్మముల్ దలఁచి చెప్పెద శంకరసంహితాకథా

  1. తా. రత్నాకరంబందు
  2. సత్కృత
  3. ము. నేగుదెంచితి
  4. తా. బృహద్వర్ణనార్థంబు
  5. తాళపత్రమున నీ పురాణముల పేరులు ముందువెనుకలుగా నున్నవి
  6. ము. నాల్గు లక్షల
  7. ము. దోషాపహృతిక్రమంబు