పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది


రోహిణీదేవియు రుక్మిణీ[1]దేవియు
          స్వాహాస్వధాతులశక్తిచయము
గంధర్వసతులును గందర్పుభామయుఁ
          గశ్యపుసాధ్వుఁలుఁ గ్రతువు[2]సతియు
వరవసిష్ఠునిరాణి ధరఁ గుంభసంభవు-
          రామయు నాదిత్యురమణిఁ గూడి


గీ.

ధరణి నొక్కటఁ బుట్టించె ధాత[3]యనఁగ
మగువ సెట్టిదేవాఖ్యుని మారమాంబ
సకలసద్గుణవిఖ్యాత[4]సౌమనస్య
మహితపంచాక్షరీమంత్ర [5].

30


క.

సెట్టియ[6]మారమ గాంచెను
దట్టుల భీమయ్యఁ బ్రోలధరణీధవునిన్
[7]దుట్టురగండని ముమ్మయ-
[8]సెట్టన విలసిల్లు వీరశేఖరు [9]నర్థిన్.

31


క.

పారావారగభీరుఁడు
నారీజనమన్మథుండు వరసుతుఁ డనఁగా
ధారణి సెట్టియభీముఁడు
వారక వర్ధిల్లునెపుడు వైభవ మలరన్.

32


క.

లాలితవైభవశీలుఁడు
లోలాక్షీమన్మథుండు లోకఖ్యాతుం
డాలోలచరిత్రుఁడు ధరఁ
బ్రోలామాత్యుండు వెలసెఁ బుణ్యోదయుఁడై.

33


సీ.

పంచాక్షరీమంత్ర పారిజాతోద్భూత
          ఫలము లే గురువు సంభాషణములు
వీరశైవాచారవిమలమార్గానూన-
          శాశ్వతం బే గురుస్వామి మహిమ
నిఖిల[10]దేశాధీశనివహ[11]ప్రణామైక-
          పాత్ర మే గురుమూర్తి పాదయుగళి
శంకరపూజాప్రశస్తదీక్షాజనా-
          హ్లాద మే గురువు హస్తాంబుజాత-


గీ.

మనఁగఁ బండిత చెనమల్లికార్జునునకుఁ
బౌత్రరత్నంబు సెట్టియ ప్రభుసుతుండు

  1. తా. నాతియు
  2. ము. సతులు
  3. తా. నాఁగ
  4. ము. సారసాఖ్య
  5. ము. మానసాత్మ
  6. తా. యమరం
  7. ము. మట్టుర
  8. తా. సెట్టియ
  9. తా. డర్థిన్
  10. తా. దేవాధీశ
  11. ము. ప్రమేయక