పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది


ధూపంబు లర్పింప దీపంబు ముట్టింప
          ఘంట వాయింప శంఖంబు లూఁద
నైవేద్య మొసగంగ నాగవల్లీపూగ-
          మునఁ [1]కప్పురంబు దాంబూల మిడఁగ
నద్దంబు సూపంగ నాలవట్టము ద్రిప్ప
          సురటి వట్టంగఁ జామరము వీవ


గీ.

బహువిధ[2]స్తుతులు పఠియింపంగ వినియుఁ
గోయతనమునఁ బువ్వులు గోయవచ్చి
చూచి శివయామినీవ్రతస్థులను నన్నుఁ
దత్ఫలంబున గణపతిత్వంబు నొందె.

42


వ.

వేదసారంబున శివునిం బూజింపుచు శివరాత్రివ్రతంబు చేసి (బ్రహ్మ) బ్రహ్మత్వంబు నొందె. విద్యాసారంబున శివునిం బూజింపుచు శివరాత్రివ్రతంబు చేసి వసురుద్రాదిత్యులు దేవత్వంబు గైకొనిరి. రాజసూయసహస్రంబును నశ్వమేధాయుతంబును గపిలధేనుకోటిదానంబును బుణ్యక్షేత్రనివాసంబును దీర్థావగాహంబును నొనర్చిన ఫలంబు కోటిగుణితంబై సుకుమారునకు సిద్ధించె. ఇతండు సర్వతపస్వులకును నిఖిలపుణ్యవంతులకును సకలభాగ్యాధికుండు. వణిక్పథంబునఁ గల్పాంతపర్యంతం బనేకభోగం(బు ల)నుభవించి కాలాంతరంబున దధీచుండనం (బరఁగు) మాహేశ్వ[రుండై] భూమియందు జన్మింపఁగలఁడు. ఇట్టిది శివ[రాత్రి]పుణ్యవ్రత మాహాత్మ్యంబు.

43


గీ.

అనిన విని యంతకుండు పురాంతకునకు
భక్తిఁ బ్రణమిల్లి పరమతాత్పర్య మొప్ప
దేవదేవునిచే నుపదేశమంది
యభవురాత్రి యముండు సేయంగఁ బూని.

44


వ.

పుణ్యశివరాత్రివ్రతంబు చేయఁబూని యభవుతో “దేవా నీ భక్తులు మాననీయులు; వారి లక్షణంబులు నాకుఁ దెలియవలయు నానతి” మ్మనుటయుఁ బ్రసన్నహృదయుండై పరమేశ్వరుండు.

45


సీ.

అఖిలాంగకముల భస్మాలేప మొనరించు
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు
భసితత్రిపుండ్రంబు భాలపట్టికఁ దీర్చు
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు
రుద్రాక్షమాలికల్ రూఢిగా ధరియించు
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు
లింగపూజాసక్తిలీనమానసుఁడైన
          నతని నా భక్తుఁగా నాత్మఁ దలఁపు


గీ.

(ప్రణవశతరుద్ర్య)మును [3]నధర్వంబు శిఖియుఁ
[4]బవనగీతియుఁ ద్వరితంబుఁ బౌరుషంబు
నీలరుద్ర్యంబుఁ బఠియించు నియతి నెవ్వఁ
డతని నా కూర్మిభక్తుఁగా నాత్మఁ దలఁపు.

46


వ.

అనిన విని ప్రీతిచేతస్కుఁడై యముఁడు మాహేశ్వరుండును, దక్షిణామూర్తియు, మృగాంకధరుండును, నీలకంఠుఁడును నగు

  1. తా. గప్పురమునం
  2. తా. స్తోత్రముల్
  3. తా. నధ్వరంబు
  4. తా. బాపనీతియు