పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67

శ. స. 1254

(ఈశాసనము గుంటూరుమండలములో నకరికల్లుగ్రామమునందు నరసింహస్వామియాలయములో నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది.)

క.

శ్రీనారీసహితుండై
శ్రీనరసింహుండు తనదు సేవాపరులను
శ్రీనగరకంటి నెప్పుడు
శ్రీనిలయులం జేసి కరుణం జేకొని కాచును.

1


శ్లో.

సదా నగరకంటిశో నృసింహా భక్తవత్సల[1]
తరంగితకృపాదృష్ట్యాః[2] పాయా ద్వో స్సార్వ్వకాలికం[3].

2


క.

స్వస్తి శ్రీశకవర్షస
విస్తరణం బెట్టిదనినం వేయిటిమీంద[4]
నిస్తారం మిన్నూఱును[5]
ప్రస్తుతి నేంబదియు నాల్గు వరలెడిచోటను.

3


సీ.

శ్రీముఖవైశాఖ శితపక్షపంచమి
            నాదివారమున మధ్యాంహ్నమందు
నగరకంటను శాంతనరసింహ్వదేవర
            సంనిదా ... మననంతలమునను[6]

  1. వత్సలః
  2. దృష్ట్యా
  3. పాయాద్వస్సార్వ్వకాలికమ్
  4. మీందన్
  5. నిస్తార మ్మిన్నూఱును
  6. అక్షరములు కొన్ని లోపించుటచేత సరియైన పాఠము నిర్ణయించుట కనువుగాకయున్నది.