పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/98

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డారంగ నగ్రజాన్మతి[1] ననంతసమంచితధర్మ్మకార్య్యములు
ధీరుండు సేయుచుండ్డుం దగ దేవగురుద్విజపూజ లొప్పంగాను.

2


చ.

వరగుణరత్నరాసి యగువలైయ[2]కును శివపాదపద్మష
ట్చరణపతివ్రతాగుణవిశాలయశోనిధి యన్నెమాంబకును
వరసుతుం డైనపోచయ యవార్య్యభుజాబలశౌర్య్యశాలి సుం
దరజితమన్మథుండ్డు రుచిధామసుతేజుం డుదారమూర్త్తియై.

3


సీ.

తమతల్లిదండ్రులకు[3] ధర్మ్మువు రాజ్యాభి
            వ్రిద్ధియుంగాం దనబుద్ధిం గోరి
శరగుణరవిమిత శకసమాసితపుష్య
            సురపతితిథియును గురుదినమును
వెలనాంటిలోపల వినుతింపంగాం బేరు
            గలిగి క్రిష్ణాబ్ధిసంగమమునందు
పొలుపైన పెదదీవిపురమున గణపతీ
            శ్వరదేవునకు గొని కరము నేభ
యింటి[4] నొసగి పెయ్య లేంభది[5] వెరసినూ
రును నఖండదీపమునకు భక్తి
దనరంగా రవీందుతారకముగ నిచ్చి
పుల్లరియును విడిచె భూనుతుండు.

4


కామరాజుగడ్డను సుక్షేత్రము యేందుము॥ శ్రీ॥

——————

  1. "అగ్రజానుమతి" అనునది సాధురూపము కాని యట్లు దిద్దిన ఛందోభంగ మగును.
  2. రాశి యగువల్లెయ
  3. తల్లిదండ్రులకును ధర్మ్మువు
  4. నేంబదింటి
  5. లేంబది