పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/97

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరము(న)సంగయకాముండు
చిరతరముగ మండపంబు (సే)యించె ధరన్.

1

—————

66

శ. స. 1235

(ఈశాసనము కృష్ణామండలములో గణపేశ్వరగ్రామమందు దుర్గాంబగుడిలో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 952.)

సీ.

స్వస్తి సమస్తరాజన్యచూడామణి
            కిరణరంజితపాదసరసిజా(తుం)
డగు కాక తియ్యధరాధీశుశ్రీవాకి
            లికి నంగరక్షయై ప్రకటశౌర్య్య
ధనుం డనం బరగి యమ్మనుజేంద్రుం డొసగిన
            వెలనాంటినాయకస్థలము వ్రిత్తిం
బెనుపొందం బడసిన పెదనీలినాయని
            యగ్రనందనులు భయార్త్తిహరులు
పురుహూతనిభుం డగు బోలైయ[1]నాయుండు
            నాయకాగ్రణి గాళినాయకుండు
ననంగం (బ)రగి రవని నతులప్రతాపసం
పన్ను లధికబాహుబలులు ఘనులు.[2]


ఉ.

వారియనుంగ్గుందమ్ముండు సువర్న్న[3]గిరీంద్రసమానధైర్య్యుం డం
భోరుహమిత్రతేజుండు ప్రభుత్వసమగ్రుండు వల్లినాయకుం

  1. బొల్లెయ
  2. ఈపద్యములో సీసపాదము లైదును గీతపాదములు రెండును గలవు.
  3. సువర్ణ్న