పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

శ్రీశాఖాబ్దము[1] లింద్రియాద్రిశశిధాత్రీసంఖ్యగా విస్ఫుర
ద్వైశాఖంబున సప్తమిని దివసక్రీడ్వారంబునన్[2] షడ్విజి[3]
గీశుం బ్రీతిం బ్రతిష్ట సేసె వరభోగేంద్రుండు సేవైకవి
ద్యావరుండు[4] చతుర్త్త[5]వంశుండు బుధాధారుండు మారుం డిలన్.

1


స్వస్తి సమస్తప్రశస్తిసహితం శ్రీమన్మహాప్రధాని సర్వ్వాధికారి
మాయిదేవపెగ్గడ తంనేలిన అద్దంకి సింగ్గళదేవనికి తనకూ అభివ్రిద్ధిగా
చెందలూరి చెంనామల్లినాథదేవర.....

(అసంపూర్తి)

—————

63

శ. స. 1177

(ఈశాసనము కృష్ణామండలములో బెజవాడలో ఇంద్రకీలపర్వతము నడుగున ఖిలమయిన మంటపములో నొకఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. IV. No. 716. ఆఱాతిమీఁదనే యీశాసనముపైని శ. స. 1177 లో గొంటూరి నారాయణదేవరాజుల ప్రధాని కూచెనపెగ్గడ అఖండదీపము పెట్టించిన ట్లున్నది. ఈశాసనము కూడ నాకాలమునందే పుట్టిన ట్లూహింపవచ్చును.)

ఉ.

(పాత్రు)ల సత్కవీంద్రుల విపశ్చిదనీకముం బ్రోచి నీ(తిచే)
ధాత్రికి నెంత్తయేనియు ముదం బొనరించిన యీపరాంగనా
పుత్రుండు దమ్మునారి బలింబోలి మహీతల మేలుం గావుతను
ధాత్రియు నబ్జమిత్రుండు సుధాకరుండుం గ్గలయంన్తకాలమును.

1
  1. "శాకాబ్దము" అని యుండవలయును.
  2. "దివసరాడ్వారంబునన్" అని యుండనోపు.
  3. ఇచ్చట గణము తప్పినది. సరియైనపాఠము చింత్యము.
  4. "విద్యాశూరుండు" అని యుండనోవు.
  5. "చతుర్త్థ" అని యుండవలయును.