|
అచల(పుత్రి)పతికి నైతీశ్వరాంకున
కమరగణనమద్పదాంబు(జు)నకు
వరదునకుం ద్రిలోకవంద్యున కెత్తించె
దీప మఖిలలోకదీపకముగ.
| 1
|
61
(ఇది కృష్ణామండలములో వేదాద్రిగ్రామమందు లక్ష్మీనరసింహస్వామిగుడిలో నొకఱాతిమీఁది శాసనము. Government Epigraphist's Collection No. 307 of 1924.)
సీ. |
శ్రీశక(భూపా)భిషేకవత్సరములు
గుణముని(భూ)చంద్రగణన మాఘ
విశదపక్షంబున దశమియు సోమవా
సరమున గణపతితలే(౦ద్ర)
(ర)మనియ్య[1]కార్య్యభారకుండు (వాయ...౦) కంటి
కాక ...........నుత్పలదళాక్షి
సూరమాంబకుం గీర్తిసారోదయుం డన్న
యకుం బుణ్యముగ జగత్ప్రకటితముగ
శ్రీవిధాతి సూరేశ్వరదేవదేవు
శివు భవానీశు సుప్రతిష్ఠితునిం జేసె
దేవతులితుండు ధారుణీదేవకులుండు
దామనామాత్యుం డాచంద్రతారకముగ .
| 1
|
క. |
శ్రీరమణమంత్రి దామయ
కోరిక దగ లెంకవంటి కోభిమతవి[2]
|
|
- ↑ "రమణీయ" అని యుండవలయును.
- ↑ "కోకవినుతవి" అని యుండవలయునేమో.