పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హతి భేదించి యఖర్వ్వగర్వ్వబలశౌర్యస్ఫూర్త్తిం గంఠీరవా
కృతియై (సన్నుత)వ్రిత్తి దాల్చి వెలసెను రే(చెర్ల)రుద్రుం డిలన్.

7


సకలజనవినుతయశుండును గుణగణాలంకారుండును నైన కా
డ్రెడ్డికి(౦) సౌభాగ్యసౌందర్యచాతుర్య్యంబులు గలిగి[1] పరగిన
పరమపతివ్రత యైన బెజ్జమాంబకుం బ్రియనందనుండును ననవరత
ధర్మ్మసమేతుండును పతిహితాచరణుండునుం గాకతెరాజ్యభార
ధౌరేయుండును సద్గుణప్రఖ్యాతుండును నతులబలపరాక్రమసమ
న్వితుండును నైన రేచెర్లరుద్రునకుం బ్రధాని.


క.

కులతిలకుండు వసుధామర
జలధిసుధాకరుం డశేషజననుతచరితుం
డలఘుఁడు రిపుతరుదావా
నలుం డనంగాం బరగె రాజనాయకుం డుర్వ్విని.

8


బొక్కెరలోని వీరభటావలి వధించి గోధుమఱతి తల దెంచి ఉద
గిరి[2] సాధించి పడిరాయనిం దోలి దాక్షారామభీమేశ్వరదేవర కక్ష
యదీపంబు లునిపి ధర్మ్మసమేతుం డైనరాజనాయకునికి ధర్మ్మ
(పత్నియు) సుచారిత్రయు వనితాలలామయు నైన రవ్వ(మాంబకు)
సుపుత్రుండు.


క.

సరనిధి[3]గంభీరుండు సు
స్థిరతేజుండు వంశశేఖరుండు దయా
కరుండు బుధాంబుజదశశత
కరుం డని వర్న్నింప[4]నొప్పుం గాటయ ధాత్రిని.

9
  1. చాతుర్య్యంబులుం గలిగి
  2. ఉద్దగిరి
  3. శరనిధి
  4. వర్ణ్నింప