పుట:శాసనపద్యమంజరి (మొదటిభాగం).pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

హరిదశ్వుం డజాచ్యుతశం
కరమూర్త్తి ద్రయీమయుండు గమలాప్తుండు భా
స్కరుండు ద(యం గాచుచుండెడుం)
గరుణారసపూర్ణ్నహృదయుం గాటయం బ్రీతింని.

5


స్వస్తి శ్రీమదపారపారావారపరివ్రుతమహీతలంబున సకలజన
వినుతం బగునంధ్రదేశంబునకు (వి)భూషణం బైన యనుమ
కొండ యనుపురవరంబు నిజరాజధానిగా నొప్పుచుంన్న కాకతె
భూపాలక్రమంబున జనవినుతయశోవిలాసుండును జయలక్ష్మీనివా
సుండును నైనరుద్రనరేంద్రసుపుత్రుండును[1] సదారాధితత్రినేత్రుం
డును విబుధజనవనవసంతుండును రమణియ్య[2]సీమంతినీజయంతుం
డును సకలజనమనోరంజనుండును నరాతిరాజమదభంజనుండును
శరణాగతరాజశరణ్యుండును వినతాఖిలరాజవరేణ్యుండును ధై
ర్య్యామరసానుమంతుండును దు(రం)గమరేవంతుండును సత్య
హరిశ్చంద్రుండును విభవామరేంద్రుండును నైన గణపతిదేవమహీ
నాథునకుం బ్రధానియై —


క.

కనకాచలధీరుండు జన
వినుతచరిత్రుండు గార్య్యవిదుం డినతేజుం
డనఘుండు గుణనిధి బెజ్జమ
తనయుండు బుధదీనభానుతనయుం డనగాంన్.

6


మ.

ప్రతిపక్షక్షితిపాలకుంజరమదప్రారంభసంరంభ ము
ద్ధతబాహానిహితప్రచండనిశీతోద్యత్ఖడ్గధారానఖా

  1. గణపతిదేవుఁడు రుద్రనరేంద్రునితమ్ముఁ డైనమహాదేవునికొడు కైనట్లు పెక్కుశాసనములం దున్నది.
  2. రమణీయ